యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) లేటెస్ట్ ఫిల్మ్ ‘మైఖేల్’. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యాక్షన్, రొమాన్స్ తో ఉత్కంఠభరితంగా సాగింది.
యంగ్ హీరో సందీప్ కిషన్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మాస్ అండ్ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మైఖేల్’ (Michael). పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి రంజిత్ జయకోడి రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), గౌతమ్ మీనన్ (Gautham Menon) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా
ఈ ద్విభాషా చిత్రం మైఖేల్ ట్రైలర్ సోమవారం విడుదలైంది. నందమూరి బాలక్రిష్ణ (Balakrishna) తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు. సందీప్ కిషన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది..... వితంతు సాలెపురుగుల సంక్షిప్త నిర్వచనంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన ప్రేమలో పడ్డా మగ సాలీడును సంభోగం ముగిసిన వెంటనే చంపే ఒక రకమైన జాతి ఇది అంటూ గౌతమ్ మీనన్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేపింది.
అక్కడి నుంచి యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ తో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక అమ్మాయి కోసం హీరో చేసిన విధ్వంసమే మైఖేల్ గా తెలుస్తోంది. డైలాగ్స్, యాక్షన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రం ప్రేమ, శృంగార సంబంధాల గురించి తెలిపే కథగా అనిపిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా.. సందీప్ కిషన్ ట్రైలర్ ను ‘ప్రేమలో కష్టపడి ఓడిపోయిన ప్రతి మనిషికి మైఖేల్ ట్రైలర్ అంకితం చేస్తున్నాని తెలిపారు.
గతంలో విడుదలైన టీజర్, పోస్టర్ల కూడా ఆకట్టుకోగా.. ట్రైలర్ మరింత హైప్ ను క్రియేట్ చేసింది. చిత్రంలో సందీప్ కిషన్ - దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించారు. సామ్ సి ఎస్ అద్భుతమైన సంగీతం అందించారు. ఫిబ్రవరి 3న తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Oka Ammayi Kosam Kakapothe Enduku Sir Manishi Brathakali..
Dedicating trailer to every Man who’s Fought Hard & Lost in Love 🖤
A Film ..https://t.co/l0gEL2QPHe pic.twitter.com/GmYKUaNnx1