‘నెక్స్ట్‌ ఏంటి’? రిలీజ్ డేట్ ఇచ్చేసారు

By Prashanth MFirst Published Nov 25, 2018, 4:26 PM IST
Highlights

గ్లామర్ గాళ్ తమన్నా, యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్‌ఏంటి’?. బాలీవుడ్‌లో ‘ఫనా’, ‘హమ్ తుమ్’లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకుడు. తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

నవదీప్, పూనమ్‌కౌర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ రిలీజయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించింది యూనిట్. ఈచిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది.

ఈచిత్రం  షూటింగ్ అంతా లండన్ లో జరిగింది. అక్కడి లొకేషన్స్, విజువల్స్ ఈ చిత్రంలో హైలైట్ అవ్వనున్నాయి. అక్షయ్ పూరి , రైనా జోషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక గతకొంత కాలంగా తెలుగులో సరైన హిట్టు లేని సందీప్ కిషన్ ఈ చిత్రం ఎలాగైనా విజయాన్ని అందిస్తుందని ధీమా గా ఉన్నాడు.

లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్‌చంద్ర భట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్‌పూరి నిర్మిస్తున్నారు. తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్‌బాబు, పూనమ్‌కౌర్, లారిస్సా తదితరులు నటిస్తున్నారు. 

click me!