విన్నింగ్ సెలెబ్రేషన్స్ బన్నీ సాంగ్ తో జరుపుకున్న వార్నర్ టీం...వైరల్ అవుతున్న వీడియో

Published : Nov 05, 2020, 04:01 PM ISTUpdated : Nov 05, 2020, 04:30 PM IST
విన్నింగ్ సెలెబ్రేషన్స్ బన్నీ సాంగ్ తో జరుపుకున్న వార్నర్ టీం...వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

ముంబై ని లీగ్ మ్యాచ్ లో ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్...ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన సన్ రైజర్స్ ఈ విన్నింగ్ సెలెబ్రేషన్స్ బన్నీ హిట్ సాంగ్ బుట్ట బొమ్మకి స్టెప్స్ వేసి జరుపుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సత్తాచాటి ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లే ఆఫ్ కి అర్హత సాధించాలంటే ముంబైపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ని అలవోకగా ఓడించి అద్భుత విజయాన్ని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. 

ఈ విజయంతో డేవిడ్ వార్నర్ సేన పాయింట్స్ పట్టికలో మూడో స్థానానికి చేరుకోవడంతో పాటు ప్లే ఆఫ్ లో కప్ కోసం అమితుమీ తేల్చుకోవడానికి అర్హత సాధించింది. ఈ అపూర్వ విజయాన్ని డేవిడ్ సేన సెలెబ్రేట్ చేసుకున్నారు. బస చేసిన హోటల్ లో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ అల వైకుంఠపురంలో చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ కి టీమ్ సభ్యులు స్టెప్స్ వేశారు. ఉత్సాహంగా బుట్ట బొమ్మ సాంగ్ కి వార్నర్ డాన్స్ వేయగా అతనితో టీమ్ సభ్యులు జాయిన్ అయ్యారు. 

బన్నీ సాంగ్ కి సన్ రైజర్స్ టీమ్ సభ్యుల స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ సంఘటనను ప్రౌడ్ గా ఫీలవుతున్నారు. గతంలో కూడా డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి బుట్ట బొమ్మ సాంగ్ కి స్టెప్స్ వేశాడు. అప్పట్లో ఆయన చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు నుండి మైండ్ బ్లాక్ సాంగ్ కి కూడా వార్నర్ స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే... 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్
తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?