రష్మిక మందన్న ‘సీతారామం’లో సుమంత్ ఇంట్రెస్టింగ్ రోల్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్..

Published : Jul 09, 2022, 03:18 PM IST
రష్మిక మందన్న ‘సీతారామం’లో సుమంత్ ఇంట్రెస్టింగ్ రోల్..  అదిరిపోయిన ఫస్ట్ లుక్..

సారాంశం

వరుస సినిమాలతో జోరు పెంచిన సుమంత్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం ‘సీతా రామం’లో అదిరిపోయే రోల్ లో నటిస్తున్నారు.  తాజాగా ఈ మూవీ నుంచి సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.  

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulqer Salman), టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్‌లు కలిసి నటించిన చిత్రం ‘సీతా రామం’(Sita Ramam). ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది చిత్ర యూనిట్.  హను రాఘవపూడి దర్శకత్వంతో ఈ ఈ రొమాంటిక్ డ్రామా తెరకెక్కింది. యుద్ధ నేపథ్యానికి వ్యతిరేకంగా సినిమా కథాంశం ఉండనుంది. దుల్కర్ సల్మాన్ సోల్జర్ గా కనిపించనున్నారు.  రష్మిక మందన్న (Rashmika Madanna) ముస్లిం అమ్మాయిగా అఫ్రీన్ పాత్రను పోషించింది. ఇదే సినిమాలో టాలీవుడ్ హీరో సుమంత్ కూడా నటిస్తున్నారు. 

తాజాగా చిత్ర యూనిట్ సుమంత్ (Sumanth) ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో సుమంత్ ఇంటెన్స్ లుక్ ను సొంతం చేసుకున్నాడు.  ‘బిగ్రేడియన్’ అనే ముఖ్య పాత్రలో సమంత్ అలరించనున్నాడు. ఇప్పటికే ‘అహం రీబూట్’, జాగర్లపూడి సంతోష్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో సుమంత్ వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.  ‘మళ్లీ మొదలైంది’ మూవీతో సుమంత్ జోరుక పెంచాడు. ఈ క్రమంలో ‘సీతా రామం’లో ముఖ్య పాత్రను పోషించి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలో వచ్చే  నెల ఆగస్టు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. స్వప్న సినిమాస్ అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ తో పాటు గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ నటించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?