
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస ప్రాజెక్ట్ లతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు డార్లింగ్ తదుపరి చిత్రాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్నారు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ ఆడియెన్స్ ను కూడా కవర్ చేసేందుకు ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ ను కూడా ‘స్పిరిట్’(Spirit)గా అనౌన్స్ చేశారు. సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ‘యానిమల్’ను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమయం దొరికినప్పుడల్లా ‘స్పిరిట్’ కాస్ట్ అండ్ క్క్యూ ను కూడా ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena kapoor)ను ప్రభాస్ కు జోడీగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రూ.17 కోట్ల రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఇప్పటికే బాలీవుడ్ యంగ్ బ్యూటీలు శ్రద్ధా కపూర్, కృతి సనన్ ప్రభాస్ సరసన నటించారు. ప్రస్తుతం దీపికా పదుకొణె కూడా Project Kలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ ముదురు భామా కరీనా కపూర్ ను ‘స్పిరిట్’లో నిజంగానే హీరోయిన్ గా ఎంపిక చేశారా? లేదా మరేదైనా కీలక పాత్ర కోసం ఎంపిక చేశారా అన్న అంశంపై కాస్తా సందేహిస్తున్నారు నెటిజన్లు. ఈ మేరకు మరికొందరు కరీనా ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా కాకుండా.. ముఖ్య పాాత్రలో కనిపించబోతుందనే చర్చ జరుగుతోంది.
ఇక ప్రభాస్ అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ను, ఇటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్యార్లల్ గా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఎక్కడా విరామం లేకుండా సెట్స్ లోనే బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కే’ సెట్స్ లో ఉన్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఈ చిత్రాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ‘ఆదిపురుష్’ మాత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.