ఓటీటీలో సుమంత్‌కి ఇంత క్రేజ్‌ ఉందా?.. `అహాం రిబూట్‌` సరికొత్త రికార్డు..

By Aithagoni RajuFirst Published Jul 19, 2024, 11:05 PM IST
Highlights

ఓ వైపు హీరోగా, మరోవైపు బలమైన కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు సుమంత్. ఆయన ఇప్పుడు సోలో హీరోగా, సోలో పాత్రతో ఓ ప్రయోగం చేశారు. 
 

సుమంత్‌ హీరో కెరీర్‌ నుంచి టర్న్ తీసుకున్నారు. ఆ మధ్య పలు సినిమాల్లో బలమైన పాత్రలతో మెప్పించారు. `సార్`, `సీతారామం`లో ఆయన కీలక పాత్రల్లో మెరిశాడు. అదే సమయంలో ఓటీటీలోనూ పాగా వేస్తున్నాడు. తాజాగా ఆయన `అహాం రిబూట్‌` అనే మూవీలో నటించారు. జులై 1న `ఆహా`లో విడుదలైన ఇది ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఇది 19 రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌ మినిట్స్ ని సాధించడం విశేషం. ఇప్పటి వరకు ఏకంగా రెండు కోట్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ ని పూర్తి చేసుకుని మరింతగా దూసుకుపోతుంది. 

హీరో సుమంత్  కెరీర్‌లో కూడా ఇది ప్రత్యేకంగా నిలిస్తుంది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి ఈ స్థాయి నెంబర్స్ రావడం ఆశ్చర్యమనే చెప్పాలి. వాయు పుత్ర ఎంటర్ టైన్మంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత రఘువీర్ గోరిపర్తి ఈ మూవీని నిర్మించారు. ఒక సింగిల్ క్యారెక్టర్ తో నడిచే ఈ చిత్రం గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుంది.  జీవితంలో ఫెయిల్ అయి ఆర్జె గా పనిచేస్తున్న నిలయ్ కి ఒక రోజు తను పనిచేస్తున్న రెడియో స్టేషన్ కి రాత్రి వేళ ఒక అమ్మయి కాల్ చేస్తుంది. తను ఆపదలో ఉన్నాను కాపాడమంటుంది. అక్కడి నుండి మొదలైన నాటకీయ పరిణామాలు చాలా ఆసక్తిగా సాగాయి. సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ అంతా కేవలం వాయిస్ రూపంలోనే వినిపిస్తారు. 

Latest Videos

`ఇలాంటి కథా, కథనాలను రాసుకోని వాటిని అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శ కుడు ప్రశాంత్ అట్లూరి సక్సెస్ అయ్యారు. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ ని బ్రేక్ చేయకుండా గ్రిప్పింగ్ గా కథనం నడిపారు . దర్శకుడిగా ప్రశాంత్ కి చాలా పరిమితులు కథ రూపంలోనే ఎదురయ్యాయి. వాయిస్ లతో క్యారెక్టర్స్ ఎంత వరకూ రిజిస్టర్ అవుతాయి వాటి ఎమోషన్స్ ఎంత వరకూ కనెక్ట్ అవుతాయి అనే సందేహాలను తన స్క్రీన్ ప్లే తో సమాధానం చెప్పాడు. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ మూవీని ఒక కథ లా కంటే ఒక ఇన్సిడెంట్ లా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. 

సుమంత్ నటన  బాగుంది. కథలో జరుగుతున్న అన్ని సంఘటనల రియాక్షన్ తన మాత్రమే ఇవ్వాలి. ఈ జాబ్ ని చాలా ఎఫెక్టివ్ గా చేసాడు.  అందుకే ఈ ప్రయోగాత్మక చిత్రం ఇప్పుడు సక్సెస్ పుల్ గా ఓటిటిలో ఆదరణ పొందుతుంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి.  నిర్మాతగా రఘువీర్  సాహసాన్ని అభినందించాల్సిందే. తొలి మూవీతోనే నిర్మాతగా ఆయన సక్సెస్‌ కావడం హ్యాపీగా ఉంది` అని టీమ్‌ వెల్లడించింది. 
 

click me!