సన్ రైజర్స్ తో సుమ.. వార్నర్ నవ్వులు!

By Prashanth MFirst Published 20, Mar 2019, 8:41 PM IST
Highlights

మాటలతో జనల చూపును తిప్పుకోనివ్వకుండా చేసే సుమ ఎలాంటి వారినైనా మాయ చేయగలరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా హైదరాబాద్ సన్ రైజర్స్ తో కనిపించిన సుమ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

మాటలతో జనల చూపును తిప్పుకోనివ్వకుండా చేసే సుమ ఎలాంటి వారినైనా మాయ చేయగలరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా హైదరాబాద్ సన్ రైజర్స్ తో కనిపించిన సుమ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వార్నర్ నవ్వుతున్నాడు అంటే సుమ సరదాగా గట్టి కౌంటర్ వేసే ఉంటారు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. 2019ఐపీఎల్ మ్యాచ్ లు 23వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 

ఈ నెల 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ మొదటి  మ్యాచ్‌ ఆడనుంది.అయితే ప్రమోషన్స్ లో భాగంగా యాడ్స్ లో క్రికెటర్స్ తో కలిసి సుమ నటించారు. వార్నర్ తో పాటు ఇండియన్ మాజీ సీనియర్ క్రికెటర్ లక్ష్మణ్, బౌలర్ భువనేశ్వర్ కూడా సుమతో కలిసి సరదాగా ఇలా నవ్వుకున్నారు. 

Last Updated 20, Mar 2019, 8:41 PM IST