బేబీకి నిజమైన అర్జున్ రెడ్డి కావాలట!

Published : Mar 20, 2019, 08:06 PM ISTUpdated : Mar 20, 2019, 08:11 PM IST
బేబీకి నిజమైన అర్జున్ రెడ్డి కావాలట!

సారాంశం

ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో షాలిని అర్జున్ రెడ్డిలో ప్రీతీ లా మాట్లాడేసింది. నాకు అర్జున్ రెడ్డి లాంటి యువకుడు కావాలని భవిష్యత్తులో అలాంటి వ్యక్తి వస్తే వెంటనే మూడు ముళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అని వివరణ ఇచ్చింది.

అర్జున్ రెడ్డి హిట్ కొట్టాక షాలిని పాండే అవకాశాలను నెమ్మదిగానే అందుకుంటున్నా.. రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది. మొదటి సినిమాలోనే హాట్ రొమాన్స్ తో పిచ్చెక్కించిన బేబీ అప్పుడపుడు గ్లామర్ ఎక్కువగా లేని క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో షాలిని అర్జున్ రెడ్డిలో ప్రీతీ లా మాట్లాడేసింది. 

నాకు అర్జున్ రెడ్డి లాంటి యువకుడు కావాలని భవిష్యత్తులో అలాంటి వ్యక్తి వస్తే వెంటనే మూడు ముళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అని వివరణ ఇచ్చింది. అర్జున్ రెడ్డిలో బేబీ అంటూ చాలా అమాయకంగా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన షాలిని నిజమైన ప్రేయసిగా నచ్చిందని మంచి గుర్తింపే తెచ్చుకుంది. కియా అర్జున్ రెడ్డి లాంటి మొగుడు కావాలని కోరుకుంది అంటే అమ్మడికి క్యారెక్టర్ ఎంతగా కనెక్ట్ అయ్యిందో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

షాలిని ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో హిట్టయిన 100% లవ్ తమిళ్ రీమేక్ 100%కాదల్ లో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల షాలిని 118 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ అంతగా సక్సెస్ అందుకోలేదు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?