హాలీవుడ్ 'అవెంజర్స్'కి మురుగదాస్ మాటలు!

Published : Feb 15, 2019, 12:34 PM IST
హాలీవుడ్ 'అవెంజర్స్'కి మురుగదాస్ మాటలు!

సారాంశం

హాలీవుడ్ సినిమాలను సౌత్ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తుంటారు. మార్వేల్ స్టూడియోస్ నిర్మించే సూపర్ హీరోస్ సినిమాలకు హాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ కారణంగానే ఆ సినిమాలను మన దగ్గర కూడా రిలీజ్ చేస్తుంటారు. 

ఈ ఏప్రిల్ లో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళ వెర్షన్ కోసం మురుగదాస్ డైలాగులు రాస్తున్నారు. 'అవెంజర్స్' ప్రాంచైజీకి ఇండియాలో విపరీతమైన ఫ్యామ్స్ ఉన్నారు. గతంలో విడుదలైన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా వస్తోన్న 'అవెంజర్స్ ఎండ్ గేమ్'కి మరింత క్రేజ్ పెంచడానికి తమిళంలో మురుగదాస్ ని మాటల రచయితగా తీసుకున్నారు. ఇప్పటివరకు మురుగదాస్ బయట సినిమాలకు కథ కానీ, డైలాగ్స్ కానీ అందించింది లేదు.

తొలిసారి ఆయన ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు. ఈ విషయం ఆడియన్స్ ని ఆకర్షించడం ఖాయం. తమిళంలోమాదిరి తెలుగు వెర్షన్ కి కూడా అగ్ర దర్శకుడిని తీసుకుంటారేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా