
ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది వారసులు వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి హీరోలు.. నిర్మాతలు,దర్శకుల వారసులే కాదు.. ఈమధ్య రాజకీయ నాయకుల వారసలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అందులొకొంత మంది సక్సెస్ అవుతుంటే మరికొంత మంది మాత్రం కనిపించకుండా పోతున్నారు. ఈ రాజకీయ నాయకుల వారసులు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్న ట్రెండ్.. కర్ణాటకలో ఎక్కువగా ఉంది.
కన్నడ నాట నుంచి ఆల్ రెడి మాజీ ముఖ్యమంతి కుమార స్వామి తనయుడు నిఖల్(Nikhil) హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జాగ్వార్ టైటిల్ తో తెలుగు ఎంట్రీ కూడా ఇచ్చిన హీరో.. మళ్లీ కనిపించలేదు. పాలిటిక్స్ లో బిజీ అయ్యాడు. ఇప్పుడు కర్ణాటక నుంచే మరో రాజకీయ సినీ వారసుడు హీరోగా ఎంట్రీ ఇబ్బతోతున్నాడు. తెలుగు మూలాలు ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy) తనయుడు కిరీటి రెడ్డి(Kireeti Reddy) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కీరీటి రెడ్డి హీరోగా.. కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. కొడుకుని హీరోగా పరిచయం చేయడం కోసం గాలి జనార్ధన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తేన్నాడు. దాని కోసం తన తనయుడిని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పటికే కిరీటి రెడ్డికి డాన్స్,యాక్టింగ్,ఫైటింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా స్పెషల్ కోచింగ్ కూడా ఇప్పించారట. హీరోగా కిరీట్ రెడ్డిక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
ఇక కన్నడ డైరెక్టర్ రాధా కృష్ణ ఇప్పటికే అక్కడ మాయాబజార్ లాంటి సినిమాలను తెరకెక్కించారు. కిరీటి రెడ్డితో రాధాకృష్ణ చేయబోయే మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. దీని కోసం భారీ బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. పునిత్ రాజ్ కుమార్ నటించిన జాకీ మూవీ స్పూర్తితో కిరీట్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్ లో లెజెండ్, యుద్దం శరణం లాంటి సినిమాలు తెరకెక్కించిన నిర్మాత సాయి కొర్రపాటి ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు.
Also Read :Trisha : ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కోవిడ్ పాజిటివ్.