`ఓజీ`ని పక్కన పెట్టి నానితో మాఫియా మూవీ..? సుజీత్‌ కొత్త ప్లాన్‌ ఇదేనా?

Published : Jan 29, 2024, 11:46 PM IST
`ఓజీ`ని పక్కన పెట్టి నానితో మాఫియా మూవీ..? సుజీత్‌ కొత్త ప్లాన్‌ ఇదేనా?

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌తో చేస్తున్న `ఓజీ` సినిమా షూటింగ్‌ ఇప్పట్లో అయ్యేలా లేదు. దీంతో దర్శకుడు సుజీత్‌ మనసు మార్చుకున్నాడట. నానితో కమిట్‌ అయినట్టు టాక్‌.

దర్శకుడు సుజీత్‌ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో `ఓజీ` మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ దాదాపు 70శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ మూవీ వాయిదా పడింది. మరో 15రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా పూర్తవుతుంది. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ కూడా అనుకుంటున్నారు. ఏప్రిల్‌లో ఏపీలో ఎన్నికలు అయిపోతే ఆ వెంటనే `ఓజీ`ని పూర్తి చేసి ఆగస్ట్ వరకు రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తుంది. 

ఇదిలాఉంటే దీనికి సంబంధించిన కొత్త అప్‌ డేట్‌ వచ్చింది. దర్శకుడు సుజీత్‌ ఈ లోపు వేరే సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నారు. నానితో సినిమా చేయబోతున్నారట. మాఫియా నేపథ్యంలో సినిమాని అనుకుంటున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయ్యిందని సమాచారం. దీన్ని కూడా డీవీవీ దానయ్య నిర్మించనున్నారని తెలుస్తుంది. `ఓజీ`కి కూడా ఆయనే నిర్మాత అనే విషయం తెలిసిందే. 

అయితే నాని మూవీ `ఓజీ` తర్వాతనే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే నాని చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో `సరిపోదా శనివారం` సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత `బలగం` వేణుతో సినిమా చేయబోతున్నారు. మరోవైపు `దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓడెలాతో ఓ సినిమా చేయాల్సింది. అలాగే త్రివిక్రమ్‌ కూడా ఓ సినిమాకి ప్లాన్‌ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సుజీత్‌ మూవీ ఎప్పుడు ఉంటుందనేది పెద్ద సస్పెన్స్. లైన్‌ ప్రకారం దీనికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉందని చెప్పొచ్చు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో