ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధుపై సుహాసిని ఫైర్.. ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ రివ్యూపై మండిపాటు.!

By team teluguFirst Published Sep 30, 2022, 12:20 PM IST
Highlights

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధుపై నటి సుహాసిని ఫైర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
 

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’(Ponniyin Selvan 1). ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేటర్లలోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన ప్రధాన పాత్రల్లో నటించారు. 

అయితే ఈ చిత్రం విడుదల సందర్భంగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, అత్యంత వివాదాస్పద అగ్ర సౌత్ & హిందీ ఓవర్సీస్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు (Umair Sandhu) సినిమా రిలీజ్ కు ముందే ఫస్ట్ రివ్యూ ను అందించారు. ‘PS1 మొదటి సమీక్షగా.. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైనింగ్ మరియు VFXతో అద్భుతమైన సినిమాటిక్ సాగా అని పించనుంది. చియాన్ విక్రమ్, కార్తీ సినిమా మొత్తంలో అన్ని విధాలా అలరించారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వడం అద్భుతంగా ఉంది. మొత్తంమీద చిత్రంలోని కొన్ని మలుపులు మరియు ట్విస్టులు, మూమెంట్స్ తో  చారిత్రక ఫిల్మ్ గా ఉండనుంది’ అంటూ రివ్యూ అందించారు. దీనిపై వెంటనే మణిరత్నం భార్య, నటి సుహాసిని మణిరత్నం ఫైర్ అయ్యారు. 

ఉమైర్ సంధు ట్వీట్ ను చూసిన సుహాసిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రివ్యూ చెప్పడానికి అసలు మీరు ఎవరు?.. ఇంకా విడుదల కూడా కానీ సినిమాపై మీరు ఎలా రివ్యూ ఇవ్వగలరు’ అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఫిల్మ్ ఫస్ట్ రివ్యూపై సుహాసిని స్పందించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఉమైర్ సంధు ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడినంటూ సౌత్, నార్త్ లో విడుదలవుతున్న చిత్రాలపై రివ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. 

ఇక సినిమా విషయానికొస్తే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విజువల్ వండర్స్ తో పాటు, నటీనటులు తమ నటవిశ్వరూపాన్ని  చూపించడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతంతానికి ఈ చిత్రాన్ని తమిళ బాహుబలిగా కొనియాడుతున్నారు. చిత్రంలో హీరోయిన్లుగా ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, క్రిష్ణన్, శోభితా ధూళిపాళ నటించారు. రూ.500 కోట్ల బడ్జెట్ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. 

 

Who is this please. What is your access to a film yet to release

— Suhasini Maniratnam (@hasinimani)
click me!