హీరోగా సుడిగాలి సుధీర్ ఇంట్రెస్టింగ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ‘కాలింగ్ సహస్త్ర’తో రాబోతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అనౌన్స్ చేశారు.
బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. ఇప్పటికే హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి చిత్రాలతో అలరించారు. చివరిగా ‘గాలోడు’తో మాస్ హిట్ ను అందుకున్నారు. ఆయన పెర్ఫామెన్స్ కూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో సుధీర్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో సుధీర్ నుంచి గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘కాలింగ్ సహస్త్ర’ (Calling Sahsra) ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రాన్ని షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.
undefined
అయితే, అదేరోజు బాలీవుడ్ నుంచి ‘యానిమల్’ రాబోతోంది. సందీప్ రెడ్డి వంగ, రన్బీర్ కాంబోలో వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక అదేరోజు బిగ్ అప్డేట్ ‘సలార్’ ట్రైలర్ కూడా రాబోతోంది. మరోవైపు ఎలక్షన్ ఫీవర్ ఉండటంతో తన సినిమాతో ఎంతలా అలరిస్తారో చూడాలంటున్నారు. ఏదేమైనా సుధీర్ డిసెంబర్ 1న రాబోతుండటం సాహసమనే అంటున్నారు. ఈ సారి కూడా హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు పాటలు, టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. సుధీర్‌గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరినీ అంచనాలను మించేలా సుధీర్‌ను సరికొత్త కోణంలో ప్రెజంట్ చేసేలా కాలింగ్ సహస్ర లో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం. మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది’’ అన్నారు.
చిత్రంతో సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం : మోహిత్ రెహమానియక్, బ్యాగ్రౌండ్ స్కోర్ : మార్క్ కె రాబిన్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ : సన్ని.డి, ఎడిటర్ గా గ్యారీ బి.హెచ్ వ్యవహరించారు.