
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోస్‌తో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ వంటి చిత్రాలతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా సందడి చేసారు. అలాగే రీసెంట్ గా గాలోడు సినిమాతో మన ముందుకు వచ్చారు. గాలోడు చిత్రంతో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం చేశారు. సినిమాకుచాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించాడు. ఓ రకంగా సుడిగాలి సుధీర్‌కు మాస్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టిందీ చిత్రం. దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అయితే ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ముఖ్యంగా సుధీర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం కథేమిటంటే... రజినీకాంత్ (సుడిగాలి సుధీర్) తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తుంటారు. ఓ సందర్బంలో గాలోడుకి, సర్పంచ్ కొడుక్కి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల (గెహనా సిప్పి) పరిచయం అవుతుంది.
ఆమె ఓసారి కష్టంలో ఉండే రజినీకాంత్ ఆమెను కాపాడుతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజినీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ.. అతను నిజాయతీగా ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజినీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజినీకాంత్ హత్య చేశాడా? నిర్దోషిగా బయటపడ్డాడా? కోటీశ్వరుడి కూతురైన శుక్లతో అతని పెళ్లి జరుగుతుందా? ప్రేమలో పడ్డ తర్వాత గాలోడులో వచ్చే మార్పు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్ గా నటించగా రిచ్ బిగ్గర్ నుంచి లాయర్‌గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి.. హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా షకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్స్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించారు. అన్నీ పాటలు చక్కగా ఉన్నాయి.