Suriya42 : నెక్ట్స్ సినిమా కోసం తమిళ స్టార్ సూర్య హార్డ్ వర్క్..వైరల్ అవుతున్న వర్కౌట్ వీడియో

By Asianet News  |  First Published Feb 12, 2023, 2:27 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం బాగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ మరింత కసరత్తులు చేస్తున్నారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్ పంచుకున్న జిమ్ వర్క్ అవుట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 
 


రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు తమిళ స్టార్ హీరో సూర్య. దీంతో కోలీవుడ్ లో అగ్ర హీరోగా మారారు. తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ సూర్యకు అభిమానులు ఉన్నారు. ఇక ‘సూరారై పోట్రు’, ‘జైభీమ్’ వంటి చిత్రాలతో ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఈరెండు చిత్రాలతో ఉత్తమ నటుడిగానూ అవార్డులను సొంతం చేసుకున్నారు. సౌత్ లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరో కూడాను.

సూర్య చిత్రం వస్తుందంటే.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ‘విక్రమ్’లో రోలెక్స్ గా కామియో అపియరెన్స్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈక్రమంలో తన తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తమిళ స్టార్ శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా కోసం సూర్య జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు. గతంలో ‘సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్’,‘7th సెన్స్’ చిత్రాల్లో సిక్స్ ప్యాక్ చూపించారు. మళ్లీ ఈ సినిమాతో ఉక్కులాంటి శరీరాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. 

Latest Videos

తాజాగా ‘సూర్య42’ చిత్రాన్ని రూపొందిస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ ఓ వీడియోను అభిమానుల కోసం విడుదల చేశారు. జిమ్ లో సూర్య పుల్ అప్స్  చేస్తూ మరింత ఫిట్ గా తయారవుతున్నారు. 3డిలో చారిత్రక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం చాలా ఫిట్ గా కనిపించేందుకు ఇలా జిమ్ లో వర్కౌట్స్  చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  సినిమా కోసం సూర్య హార్డ్ వర్క్, డెడికేషన్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 

ఇక ఈ చిత్రం Suriya 42 వర్క్ టైటిల్ తో రూపొందిస్తున్నారు.  చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్ గా కనిపించబోతున్నారు. యోగి బాబు, కింగ్స్లీ, కోవై సరళ, ఆనంద్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 10 భాషల్లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు హిందీ రీమేక్ గా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘సూరారై పోట్రు’లోనూ క్యామియో అపియెర్స్ ఇవ్వబోతున్నారు. 

The Man of Hardwork and Dedication ❤️❤️❤️❤️ Anna ❤️❤️❤️ 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/p6ZtEv1A6N

— Studio Green (@StudioGreen2)
click me!