
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలు, రాజకీయ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వినోదయ సిత్తం, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాల వెనుక మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లానింగ్ ఉంటుందనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ లైనప్ లో వరుస చిత్రాలు ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మరో డైరెక్టర్ ని రంగంలోకి దించారు. ఊహించని విధంగా ఫ్లాప్స్ లో ఉన్న సుధీర్ వర్మ తెరపైకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ చిత్రం గురించి స్వయంగా సుధీర్ వర్మ స్పందించడం విశేషం.
సుధీర్ వర్మ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ తో రావణాసుర అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా రోజుల క్రితం త్రివిక్రమ్ గారు ఒక స్టోరీ లైన్ చెప్పారు. ఈ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం. త్రివిక్రమ్ పవర్ స్టార్ కి ఆ లైన్ చెప్పారట. ఆయనకి నచ్చింది. నన్ను స్టోరీ డెవలప్ చేయమని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారి లైనప్ ఎక్కువగా ఉంది. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు అని సుధీర్ వర్మ తెలిపారు.
సుధీర్ వర్మ చెప్పిన ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాకింగ్ అనే చెప్పాలి. సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. గతంలో సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి.