సరిగ్గా ఇదే రోజు ఐదేళ్ల క్రితం అనసూయ ఇలా!

Published : Mar 19, 2023, 04:19 PM IST
సరిగ్గా ఇదే రోజు ఐదేళ్ల క్రితం అనసూయ ఇలా!

సారాంశం

అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఐదేళ్ల క్రితం అనసూయ లుక్ షేర్ చేసింది. అలాగే తనకు సదరు డెస్ చాలా ఫేవరెట్ అట.   

యాంకర్ అనసూయ కెరీర్లో ఎదిగిన తీరు చాలా స్ఫూర్తిదాయకం. హీరోయిన్ కావాలనే కోరికతో అనసూయ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆమెకు అవుట్ ఆఫ్ ఫోకస్ రోల్స్ మాత్రమే దక్కాయి. దీంతో కొన్నాళ్లు  జాబ్ చేసింది. 2013లో జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు, ఒక్క షో ఆమె దశ తిరిగేలా చేసింది. అనసూయ కల్లో కూడా ఊహించని రేంజ్, ఇమేజ్ ఆమె సొంతమయ్యాయి. 

హీరోయిన్ కావాలన్న కల జబర్దస్త్ యాంకర్ కావడం ద్వారా తీరింది. దాదాపు తొమ్మిదేళ్లు అనసూయ జబర్దస్త్ లో పని చేశారు. మొదట్లో వ్యక్తిగత కారణాలతో కొంత కాలం దూరమయ్యారు. అప్పుడు రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. రష్మీ, అనసూయ ఇద్దరూ భారీగా లబ్ధి పొందారు. 

అదే సమయంలో అనసూయ మీద వ్యతిరేకత, విమర్శలు కూడా వినిపించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో అనసూయ డ్రెస్సింగ్ వివాదాస్పదమైంది. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. నన్ను, నా డ్రెస్సింగ్ ని జడ్జి చేసే హక్కు మీలో ఎవరికీ లేదని ఘాటుగా చెప్పింది. వ్యతిరేకతకు అనసూయ వెరవలేదు, తన డ్రెస్సింగ్ మార్చుకోలేదు. ప్రతివారం ఒక ఎపిసోడ్, ఎపిసోడ్ కో డ్రెస్. సదరు డ్రెస్లలో ఫోటో షూట్ చేసిన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ఆమెకు హాబీగా మారిపోయింది. 

కాగా ఐదేళ్ల క్రితం అనసూయ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. అప్పుడు నేను ఇలా ఉండేదాన్ని. అలాగే నాకు ఈ కాస్ట్యూమ్ అంటే చాలా ఇష్టం అని కామెంట్ చేశారు. అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే.  కాగా అనసూయ లేటెస్ట్ మూవీ రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. మార్చి 22న ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణల కూతురిగా అనసూయ నటిస్తున్నారు. 

రంగమార్తాండ మూవీ మీద పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అంటున్నారు. అలాగే అనసూయ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ ల ఈ క్రైమ్ డ్రామా చిత్రీకరణ జరుపుకుంటుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?