పహిల్వాన్.. టైమ్ చూసి టచ్ చేస్తున్నాడు

Published : Aug 21, 2019, 04:54 PM IST
పహిల్వాన్.. టైమ్ చూసి టచ్ చేస్తున్నాడు

సారాంశం

ఈగ సినిమాతో విలన్ గా క్లిక్కయిన తరువాత కన్నడ స్టార్ సుదీప్ మిగతా భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. కన్నడలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సుదీప్ మిగతా భాషల పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు.   

సైరా సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్న సుదీప్ దబాంగ్ 3లో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతనికి అన్ని భాషల్లో క్రేజ్ రావడంతో హీరోగా చేసిన తన కన్నడ సినిమాను అన్ని ప్రముఖ భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన పహిల్వాన్ సినిమాను కన్నడతో పాటు తెలుగు తమిళ్ హిందీ మలయాళం బాషాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. 

క్రేజ్ ఉన్న మూమెంట్ లో గురువారం అన్ని భాషల ప్రజలను  ట్రైలర్ తో టచ్ చేయడానికి సిద్దమయ్యాడు. సెప్టెంబర్ 12న రానున్న ఈ సినిమాతో సుదీప్ ఎంత వరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక పహిల్వాన్ సినిమాలో సుదీప్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. కన్నడలో లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎస్ కృష్ణా తెరకెక్కించిన ఈ సినిమాను స్వప్న కృష్ణ నిర్మించారు.  

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది