'సైరా'ని టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు.. ఏం జరుగుతుందో!

By tirumala ANFirst Published Aug 21, 2019, 4:51 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగష్టు 20న రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సైరా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగష్టు 20న రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సైరా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. 

రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రం 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత అయిన ఫరాన్ అక్తర్ ఎక్సయిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. 

భారీ అంచనాలు నెలకొని ఉన్నా సైరాకి మంచి టాక్ వస్తే భారీ వసూళ్లు ఖాయం. హిందీ వర్షన్ కు సంబంధించి ఓ విషయం చిత్ర యూనిట్ ని కలవరపెడుతోంది. సైరా రిలీజ్ అవుతున్న అక్టోబర్ 2నే బాలీవుడ్ లో భారీ యాక్షన్ చిత్రం వార్ రిలీజవుతోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్, టైగర్ ష్రాఫ్ లకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం అదే రోజున విడుదలైతే సైరా హిందీ వసూళ్లకు గండి పడ్డట్లే. 

కానీ 'వార్' చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. గత ఏడాది విడుదలైన డిజాస్టర్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ని కూడా నిర్మించింది యష్ రాజ్ సంస్థే. ఈ చిత్రం వల్ల బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. నష్టాలని కొంతవరకైనా భర్తీ చేసి తమని ఆదుకోవాలని బయ్యర్లు కోరగా నిర్మాతలు నిరాకరించారు. కనీసం వార్ చిత్ర హక్కులని తక్కువ ధరకు అమ్మాలని కోరినా వినలేదు. దీనితో బయ్యర్లంతా వార్ చిత్రాన్ని కొనకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే వార్ మూవీ వాయిదా పడ్డట్లే. ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

click me!