హీరోను సూపర్ స్టార్ చేసేది దర్శకుడు కాదు..డౌటా?

Published : Dec 12, 2016, 07:00 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
హీరోను సూపర్ స్టార్ చేసేది దర్శకుడు కాదు..డౌటా?

సారాంశం

హీరోని సూపర్ స్టార్ ని చేసేదెవరు? డైరెక్టరా... హీరోయినా? ఇది తెరచాటు వ్యవహారం మరి తెరమీద హీరోని చేసేదెవరు..

ఆయన్నెవరూ ఇంతవరకు గుర్తించలేదు.  ఎవరు ఆయన నైపుణ్యం గురించి రివ్యూ చేయలేదు.  సినిమా జర్నలిజం హీరోని హీరోచేసే వాళ్లకి గుర్తింపు లేదు . హీరోని హీరో చేసేందుకు వాళ్లు చేసే త్యాగాలకు లెక్కే లేదు. ఒక్కోసారి ప్రాణాలు కూడ పొగొట్టుకుంటుంటారు. వాళ్లెవరో గుర్తొచ్చిందా... వాళ్లే స్టంటు మాస్టర్లు. పబ్లిక్  పెద్దగా పట్టించుకోని అతి కీలకమయిన ఈ కళ కి గుర్తింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి  ఉత్తమ స్టంటు మాస్టర్ల తయారవుతారు.

 

సినిమా రంగానికి సంబంధించి 24 విభాగాలది దేనికదే ప్రత్యేకం.  హీరోను మనం సూపర్ హీరో రేంజ్ లో అంగీకరించాలంటే... ఆహీరోఎంత మంది విలన్ల మక్కెలిరగ తన్నాలి... సినిమాలో మెయిన్ విలన్ ను ఏ రేంజ్ లో ఉతికి ఆరేయాలి.

 

మన హీరోలు ఆ రేంజ్ లో విలన్లను ఉతికి ఆరేస్తుంటే.. ఆస్వాదించే మనకు.. దాని వెనుక ఎంతటి కృషి ఉంటుందో తెలియదు. స్టంట్ మాస్టర్ సీన్ టు సీన్ ఫైట్ లో కొత్తదనం చూపేందుకు.. హీరో కోసం  ఏ రేంజ్ లో పని చేస్తాడో మనం ఊహించలేం. పైగా చేసిందే చేస్తే మనకు ఒక పట్టాన నచ్చదు. మరి అలాంటి టఫ్ జాబ్ ఎంతటి కష్టతరమో, ఎంత క్రియేటివిటీ ఉండాలో, ఎంత శరీర ధారుఢ్యం ఉండాలో ఊహించొచ్చు. అసలు స్టంట్ మాస్టర్ సూపర్ హిట్ ఫైట్ రూపొందిస్తేనే హీరోకు హీరో ఇమేజ్ వచ్చది.

 

మరి అలాంటి ఫైట్స్ రూపొందించే స్టంట్ మాస్టర్స్ ను గుర్తించాల్సిన బాధ్యత ఇటు ఇండస్ట్రీ పైనా, అటు ప్రభుత్వం పైనా ఉంది. అందుకే ఇకపై స్టంట్ మాస్టర్లకు జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ అవార్డు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇకపై సమాచార ప్రసార శాఖ ద్వారా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో స్టంట్స్ కేటగిరీకి ప్రత్యేక అవార్డు ఇవ్వనుంది.

 

వచ్చే ఏడాది జరిగే 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అదనంగా ఉత్తమ స్టంట్ దర్శకత్వం కేటగిరీకి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రకటన వెనుక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు,అల్లుడు ఐశ్వర్య ధనుష్ ల కృషి వుంది. స్టంట్ కేటగిరీకి జాతీయ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాయటంతో స్పందించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చే యేడాది నుంచి స్టంట్ డైరెక్షన్ కేటగిరీ అవార్డు ఇచ్చేందుకు అధికారిక అనుమతులు ఇచ్చినట్లు సమాచారం.

 

స్టంట్ కేటగిరీతో పాటు ఆడియోగ్రఫీ-లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ కేటగిరీలో కూడా ఉత్తమ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్