
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాహుబలిని టీవీ సీరియల్‌గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఓ నేషనల్ చానెల్ ఇందు కోసం ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. మొత్తంమీద ఐదు గంటల బాహుబలి సినిమాను రూపొందించడానికి నూట యాబై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నప్పుడు డైలీ సీరియల్ కోసం ఎంత ఖర్చు పెడతారనేదే ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై యూనిట్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.