ఫ్లాప్ హీరో రూ.కోటి డిమాండ్!

Published : Nov 26, 2018, 03:06 PM IST
ఫ్లాప్ హీరో రూ.కోటి డిమాండ్!

సారాంశం

కొంతమంది హీరోలకు స్టార్ డం చాలా తొందరగా వచ్చేస్తుంటుంది కానీ ఎక్కువరోజులు దాన్ని క్యారీ చేయడంలో ఫెయిల్ అవుతుంటారు. ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్ ఇలా చాలా మందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కొంతమంది హీరోలకు స్టార్ డం చాలా తొందరగా వచ్చేస్తుంటుంది కానీ ఎక్కువరోజులు దాన్ని క్యారీ చేయడంలో ఫెయిల్ అవుతుంటారు. ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్ ఇలా చాలా మందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఇప్పుడు అదే కోవలో హీరో రాజ్ తరుణ్ పేరు కూడా చెప్పుకోవచ్చు. 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన రాజ్ తరుణ్ ఆ తరువాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించారు. హీరోగా నటించడానికి రూ.కోటి రూపాయలు డిమాండ్ చేసేవాడు. అయితే ఈ మధ్య కాలంలో అతడి కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది.

ఈ ఏడాదిలో 'రంగుల రాట్నం', 'రాజుగాడు', 'లవర్' చిత్రాల్లో నటించిన వరుస ఫ్లాప్ లు మూటగట్టుకున్నాడు. ఇలాంటి నేపధ్యంలో ఈ హీరో కథల మీద దృష్టి పెట్టకుండా తన 
రెమ్యునరేషన్ మీదే ఆసక్తి చూపిస్తున్నాడని టాక్.

వరుస ఫ్లాప్ లు ఉన్న ఈ హీరోని పెట్టి సినిమాలు చేయాలంటే మార్కెట్ పరంగా నిర్మాతలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సివుంటుంది. కనీసం హీరో తన పారితోషికం తగ్గించుకుంటే ఓ చిన్న సినిమా తీసే సాహసం చేస్తారు. కానీ ఈ యంగ్ హీరో మాత్రం రూ. కోటి ఎవరైతే ఇస్తారో వాళ్లతోనే  సినిమా చేస్తానని భీష్మించుకొని కూర్చున్నాడట. 

PREV
click me!

Recommended Stories

MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్