సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..?

Published : Jan 22, 2023, 04:54 PM ISTUpdated : Jan 22, 2023, 05:17 PM IST
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..?

సారాంశం

ప్రముఖ సింగర్ మంగ్లీ కారు‌పై రాళ్ల దాడి జరిగింది. ఆమె ఉన్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి.   

ప్రముఖ సింగర్ మంగ్లీ కారు‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కర్ణాకటలో గత రాత్రి చోటుచేసుకుంది. తెలుగులో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ.. ఇతర భాషల్లో తన గానంతో ఆదరణ సంపాదించుకుంటున్నారు. శనివారం రాత్రి మంగ్లీ బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె స్టేజ్‌ మీద పాటలు పాడటం ముగించుకుని..అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే స్టేజ్ వెనక్కి వెళ్లింది. అయితే ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకున్నారు. 

అయితే వేదిక వెనుకవైపు ఉన్న మేకప్ టెంట్‌లోకి కూడా యువకులు ప్రవేశించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు యువకులపై స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ ఉద్రిక్తతల మధ్యే మంగ్లీ  కారులో అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కొందరు ఆమె ఉన్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. 

ఇదిలా ఉంటే.. ఇటీవల చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వేదికపై మంగ్లీ తెలుగులో మాట్లాడి ‘‘అందరూ బాగున్నారా..’’ అని అడిగింది. అప్పుడు యాంకర్ అనుశ్రీ ఇక్కడ కన్నడవాళ్లు ఉన్నారు కాబట్టి కన్నడ కూడా మాట్లాడండి అని చెప్పింది. ఈ క్రమంలోనే మంగ్లీ.. ‘‘అనంతపురం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. అందరూ తెలుగు వస్తుంది’’ అని అని తెలుగులో చెప్పారు. అయితే మంగ్లీ  తెలుగులో మాట్లాడటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని మనసులో పెట్టుకుని ఎవరైనా బళ్లారిలో మంగ్లీ కారుపై రాళ్లు రువ్వారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు