ఫస్ట్ స్టిల్: మహేష్ @ కొండారెడ్డి బురుజు సెట్!

By AN TeluguFirst Published Sep 23, 2019, 11:53 AM IST
Highlights

కర్నూలు కొండారెడ్డి బురుజు ను మళ్ళీ మనం మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ మూవీ సరిలేరు నీకెవ్వరు లో చూడబోతున్నాము. కీలక సన్నివేశాల కోసం తొలుత కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేయాలనుకున్నారు.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్  చిత్రం ఒక్కడు  . ఒక్కడు లో ఛార్మినార్ సెట్ తెలుగు సినీ చరిత్రలోనే ప్రత్యేకమైన లావిష్ సెట్ అన్న చర్చ అప్పట్లో సాగింది. ఆ సెట్ తో  పాటే కర్నూలు కొండారెడ్డి బురుజు లైవ్ లొకేషన్ లోనూ ఒక్కడుకి సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్. దాంతో కొండారెడ్డి బురుజు సీన్స్ సైతం బాగా పాపులర్ అయ్యాయి. అయితే అప్పటి నుంచీ మళ్లీ ఆ లొకేషన్ లో సీన్స్ తీసిన వాళ్లు లేరు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి మహేష్ మళ్లీ చేస్తున్నారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు ను మళ్ళీ మనం మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్ మూవీ సరిలేరు నీకెవ్వరు లో చూడబోతున్నాము. కీలక సన్నివేశాల కోసం తొలుత కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేయాలనుకున్నారు. అయితే కొన్ని సమస్యల వల్ల లైవ్ లొకేషన్ కి వెళ్లడం కుదరలేదట. అందుకే రామోజీ ఫిలింసిటీలో ఈ లొకేషన్ ని సెట్స్ రూపంలో రీక్రియేట్ చేస్తున్నారు. అక్కడే సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక బురుజు దగ్గర మహేష్ బాబు ఉండగా.. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

‘‘16 సంవత్సరాల క్రితం ఈ కట్టడం(కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కట్టడం వద్ద మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు’’ అంటూ అనిల్ రావిపూడి కామెంట్ పెట్టాడు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కుతోంది. ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

16 years ago, this location became iconic on the silver screen. Now we are back to the same location. This time we aim to make it bigger. Our production designer A.S prakash garu recreated the location spectacularly.The man who brought Kurnool Kondareddy Buruju to Ramoji FilmCity pic.twitter.com/OcAaWEA8K1

— Anil Ravipudi (@AnilRavipudi)
click me!