మహేష్‌ బ్లాక్‌ బస్టర్ కి ఏడాది.. `సర్కారు వారి పాట` అప్‌డేట్‌ ఏంటి?

Published : Jan 11, 2021, 09:48 AM IST
మహేష్‌ బ్లాక్‌ బస్టర్ కి ఏడాది.. `సర్కారు వారి పాట` అప్‌డేట్‌ ఏంటి?

సారాంశం

మహేష్‌ ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్‌ ఎండింగ్‌లోగానీ, జనవరి ప్రారంభంలోగానీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

మహేష్‌ నుంచి సినిమా వచ్చి ఏడాదవుతుంది. ఆయన చివరగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా ముందుగా యావరేజ్‌ టాక్‌ వచ్చినా సంక్రాంతి సీజన్‌ కావడంతో మంచి కలెక్షన్లని రాబట్టింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తయ్యింది. ఏడాది పూర్తయిందని సందడి చేస్తుంది టీమ్‌. అయితే ఇప్పటి వరకు మహేష్‌ మరో సినిమాని పట్టాలెక్కించకపోవడం గమనార్హం. 

మహేష్‌ ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్‌ ఎండింగ్‌లోగానీ, జనవరి ప్రారంభంలోగానీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు. స్క్రిప్ట్ విషయంలో డిలే అవుతుందా? లేక ఆలస్యమయ్యే కొద్ది ప్రాజెక్ట్ విషయంలో ఏదైనా డౌట్స్ క్రియేట్‌ అవుతున్నాయా? అన్నది సస్పెన్స్ నెలకొంది. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఎంబీ, 14ప్లస్‌, మైత్రీ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. 

మరోవైపు మహేష్‌, వెంకటేష్‌ నటించిన మల్టీస్టారర్‌ చిత్రం `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రం విడుదలై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మల్టీస్టారర్‌ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టించిన చిత్రమిది. ఫ్యామిలీ అనుబంధాలన ప్రధానంగా రూపొంది సూపర్‌ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే