మరో లగ్జరీ కారు కొన్న మెగాస్టార్‌ చిరంజీవి, ఫీచర్స్ తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే

Published : Apr 12, 2023, 01:08 PM IST
మరో లగ్జరీ కారు కొన్న మెగాస్టార్‌ చిరంజీవి,  ఫీచర్స్ తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి గ్యారేజీలో మరో లగ్జరీ కారు వచ్చిచేరింది.  అత్యంత ఖరీదైన ఈ కారు అద్భుతమైన పీచర్స్ తో మతి పోగొట్టేలా ఉంది. రీసెంట్ గా రిజిస్టేషన్ చేయించడంతో పాటు.. ఫ్యాన్సీ నెంబర్ కూడా ఇచ్చారు ఆర్టీఏ అధికారులు. 

ఇప్పటికే  మెగాస్టార్ చిరంజీవి గ్యారేజీలో ఎన్నో అద్భుతమైన పీచర్స్ కలిగిన..లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం అందులోకి మరో కారు వచ్చి చేరింది.  ఆ అత్యాధునిక లగ్జరీ కారు పేరుది టొయోటా వెల్‌ఫైర్‌.  రీసెంట్ గా ఈ కారును కొనుగోలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో ఇష్టంగా ఈ కారును కొన్నారు మెగాస్టార్. రాజసం ఉట్టిపడే ఈ కార షోరూం ధర, లైఫ్‌ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయలు అని సమాచారం.  

మెరుపులు మెరిపించే.. బర్నింగ్‌ బ్లాక్‌ కలర్ తో.. చూడగానే కళ్లు మిరుమిట్లుగొలిపేలా ఉన్న ఈకారు..చూసేవారికి కనువిందుగా దర్శనమిస్తుంది. ఇక ఈ కారుకు సబంధించిన రిజిస్టేషన్ పనులు పూర్తి అయ్యాయి. ఈ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు.  అంతే కాదు మంచి ఫ్యాన్సీ నంబర్ కూడా సాధించారు మెగాస్టార్. దానికోసం 4.70లక్షలు ఖర్చు పెట్టారు చిరంజీవి.  టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను మెగాస్టార్‌ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్‌ స్వయంగా వచ్చారు. 

కొణిదెల చిరంజీవి పేరుతో కారు  రిజిస్ట్రేషన్‌ అయింది. ఆర్టీఓ రామచంద్రం మెగాస్టార్ కు దగ్గరుంచి కావల్సిన ఏర్పాట్లు చేశారు. ఆయన  సమక్షంలో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారుచిరు. ఇక ఈకారు ఫీచర్స్ తెలిస్తే మతి పోవాల్సిందే.  టొయోటా నుంచి  రిలీజ్ అయిన ఈ కారు.. అత్యాధునికమైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కూడా కలిగి ఉంది. హైస్పెసిఫికేషన్స్‌తో విడుదలైన ఈ మల్టీపర్పస్‌ వెహికిల్‌లో  ఏడుగురు ప్రశాంతంగా కూర్చునే విధంగా సీట్ సిస్టం ఉంది. అంతే కాదు మధ్యలో ఉన్న సీటు వీఐపీ సీట్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అంతే కాదు ఇందులో కూర్చునే ఏడుగురు వ్యక్తులకు ప్రమాదం జరిగినప్పుడు కాపాడటానికి ఏడు ఎయిర్ బ్యాక్స్ కూడా ఉండటం విశేషం. 

అంతే కాదు ఈ కారులో టాప్ చూసుకున్నట్టయితే.. ట్విన్‌ సన్‌రూఫ్‌, త్రీజోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ తో పాటు.. లోపన ఎంటర్ టైన్మెంట్ కోసం..  13 అంగుళాల స్క్రీన్స్‌ కూడా వచ్చింది. ఫ్రంట్‌లో రూట్ మ్యాప్ కోసం.. ఇతర అవసరాలకు  పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్‌లో ఆటో, యాపిల్‌ కార్‌ప్లే సపోర్ట్‌ చేస్తాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ కూడా ఉన్నాయి. ఇందులో ఈ వాహనం బర్నింగ్‌ బ్లాక్‌, వెల్‌ఫైర్‌ పెరల్‌ వైట్‌, గ్రాఫైట్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ తో నడిచే ఈ కారు. లీటర్ కు 16.35 కిలో మీటర్లు వస్తుంది. ఇక వీటికి ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్స్‌ ఉండటం తో పాటు..  2.5 పెట్రోల్‌ ఇంజిన్‌.. మరో రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు కూడా ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్