సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా షురూ.. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో టిల్లు.. డిటేయిల్స్

Published : Dec 11, 2023, 07:16 PM IST
సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా షురూ.. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో టిల్లు.. డిటేయిల్స్

సారాంశం

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ వరుస పెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మూవీని ప్రారంభించి షాకిచ్చారు. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

‘డీజే టిల్లు’తో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)  దక్కించుకున్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో సిద్ధూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న Tillu Squareతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఓవైపు ఈ మూవీ ప్రమోషన్స్ ను నిర్వహిస్తూనే మరోవైపు తన అప్ కమింగ్ ఫిల్మ్స్ ను గాడిన పెడుతున్నారు. క్రేజీగా అప్డేట్స్  అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. 

ఇప్పటికే ‘తెలుసు కదా’ (Telusu Kada)  చిత్రంలో నటిస్తున్నారు సిద్ధూ. డిజైనర్ నీరజ కొన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు, థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. రీసెంట్ గానే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేసి ఆడియెన్స్ ను, అభిమానులను ఆకట్టుకున్నారు సిద్ధూ. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను షురూ చేశారు. కొద్ది సేపటి కిందనే అధికారిక ప్రకటననూ విడుదల చేశారు. 

సిద్ధూ జొన్నలగడ్డ చేయబోతున్న మరో కొత్త సినిమాను శ్రీ వేంకటేశ్వర్ సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) దర్శకత్వం వహించబోతుండటం విశేషంగా మారింది. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందింది. అయితే సిద్దూ ఇప్పటికే లవ్ అండ్ రొమాంటిక్, కామెడీ చిత్రాలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. అప్పటికే భాస్కర్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. చివరిగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ అందుకున్నారు. కాస్తా గ్యాప్ తీసుకొని సిద్ధూతో రాబోతున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను ఈరోజే ప్రారంభించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కామెడీ జోనర్ లోనే సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తున్న 37వ చిత్రం కావడం విశేషం. అనౌన్స్ మెంట్ తో విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. గన్ ఫైర్ చేస్తూ భాస్కర్ ఇచ్చిన స్టిల్ ఆసక్తికరంగా మారింది. ఏదైనా డిఫరెంట్ సబ్జెక్ట్ ను ట్రై చేయబోతున్నారా? అనేది సందేహంగా మారింది. ఇంకా హీరోయిన్, టెక్నీషియన్ల వివరాలను తెలియజేయాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Ram Charan ‌Daughter Klin Kaara: రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను మోసం చేయబోయిన భద్రావతి.. చివరి నిమిషంలో అడ్డుకున్న రామరాజు