గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ గీతా మాధురి... ఫ్యాన్స్ శుభాకాంక్షలు!

Published : Dec 11, 2023, 05:17 PM ISTUpdated : Dec 11, 2023, 05:22 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ గీతా మాధురి... ఫ్యాన్స్ శుభాకాంక్షలు!

సారాంశం

స్టార్ సింగర్ గీతా మాధురి మరోసారి తల్లి కాబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.   

సింగర్ గీతా మాధురి అభిమానులతో ఒక స్వీట్ న్యూస్ పంచుకున్నారు. ఆమె గర్భవతిగా ఉన్నట్లు తెలియజేశారు. మరో మూడు నెలల్లో గీతా మాధురి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందట. దాక్షాయణి ప్రకృతి ఫిబ్రవరి 2024లో తల్లికాబోతుంది, అని కూతురుని ఉద్దేశించి గీతా మాధురి పోస్ట్ పెట్టారు. 

గీతా మాధురి 2014లో నటుడు నందు ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2019లో ఒక అమ్మయ్హి పుట్టింది. ఐదేళ్లకు సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. గీతా మాధురి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. గీతా మాధురి బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనడం విశేషం. నాని హోస్ట్ గా ఉన్న సీజన్ 2లో ఆమె కంటెస్ట్ చేశారు. 

ఫైనల్ లో టైటిల్ రేసులో నిలిచారు. కౌశల్-గీతా మాధురి టైటిల్ కోసం పోటీపడ్డారు. కౌశల్ గెలవగా... గీతా మాధురి రన్నర్ గా నిలిచింది. గీతా మాధురి భర్త నందు నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన వధువు సిరీస్లో నందు నటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?