
దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మేనియాతో ఊగిపోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టగా... సినిమా అద్భుతం అంటున్నారు. ఓపెనింగ్స్ లో ఆర్ ఆర్ ఆర్ కొత్త రికార్డ్స్ సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. యూఎస్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి పేరు మరోసారి ఇండియా వైడ్ మారుమ్రోగుతుంది.
ఇక నేడు రామ్ చరణ్ (Ram Charan birthday)బర్త్ డే కాగా... ఈ ఏడాది చాలా స్పెషల్ గా నిలిచింది. నాలుగేళ్ళ ఆయన శ్రమకు ఆర్ ఆర్ ఆర్ రూపంలో దక్కింది. చరణ్ నటన సినిమాలో హైలెట్ కావడం విశేషం. చరణ్ ముందు ఎన్టీఆర్ పాత్ర తేలిపోయింది. ఆర్ ఆర్ ఆర్ లో అసలు హీరో చరణ్ అయ్యాడు. బ్రిటిష్ వాళ్లపై పోరాడడానికి రామ్, భీం పాత్రలకు వేరు వేరు కారణాలున్నాయి. అయితే భీమ్ లక్ష్యం తాత్కాలికంగా చేసి రామ్ పోరాటం శాశ్వతమైన కీలకమైనదిగా చూపించారు. అలా రామ్ కథలో భీమ్ భాగమయ్యాడు కానీ, ఆ పాత్రకు ప్రత్యేకత, బలం లేకుండా పోయాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
చరణ్ (Ram Charan)మాత్రం వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకుని మరో మెట్టుకు ఎదిగారు. సోషల్ మీడియాలో చరణ్ నటనకు సర్వత్రా ప్రసంశలు దక్కుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో స్టార్ ప్రొడ్యూసర్ పీవీపీ చేరారు. ఆయన చరణ్ బర్త్ డే సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తాడు. చరణ్ ని తండ్రిని మించిన తనయుడిగా అభివర్ణించాడు. ''చిరంజీవి కొడుకు కూడా ఓ చిరంజీవే!! చిరంజీవి గారి కొడుకు అనే స్థాయి నుంచి, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు అనే స్థాయికి తన నటనతో దేశం మొత్తాన్ని మెప్పించిన నటుడు రామ్ చరణ్. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ నేపథ్యంలో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. చరణ్ తన 15వ చిత్రం దర్శకుడు శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేయడానికి సైన్ చేశారు.