
ఈ మధ్య స్టార్ సెలబ్రిటీల రిటన్ గిఫ్ట్స్ ఎక్కువైపోయాయి. సినిమా హిట్ అయితే చాలు ప్రొడ్యూసర్లు కాని, హీరోలు కాని.. సినిమాకోసం కష్టపడ్డవాళ్లకు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్ అయ్యింది. డాన్స్ మాస్టార్ జానీ కూడా ఈ మధ్య అలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి అందుకున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. దాదాపు 15 లక్షల విలువైన థార్ కారును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా సుదీప్ తో కలిసి జానీ మాస్టర్ కొత్త కారు ముందు నిలిచి ఫొటోలు దిగారు. ఈ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జానీ మాస్టర్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈఫోటోలు వైరల్ అవుతున్నాయి. సుదీప్ హీరోగా నటించిన మల్టీ లాంగ్వేజ్ మూవీ విక్రాంత్ రోణా లో ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుదీప్ తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ పాట కోసం జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీకి, స్టెప్పులకు .. జానీ మాస్టర్ పనితనానికి ఫిదా అయ్యాడు కిచ్చా. అందుకే అంత కాస్ట్లీ కారును జానీ మాస్టర్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.
కాగా జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ గా ఫిల్ బిజీగా ఉండగా.. కన్నడ స్టార్ హీరో సుదీప్ అటు కన్నడతో పాటు మల్టీ లాంగ్వేజ్ లో సినిమాలు చేస్తున్నారు. ఈమధ్య ఇతర భాషల్లో సినిమాలు తగ్గినా.. తన కన్నడ సినిమాలను మాత్రం డబ్బింగ్ చేసి.. తనకు మంచి ఇమేజ్ ఉన్న తెలుగు లాంటి భాషల్లో రిలీజ్ చేసేస్తున్నారు.