సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ చిత్రాన్ని అందించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ (Dil Raju).. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. భారీ స్కేల్ లో మూడు చిత్రాలను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ ప్రొడక్షన్ లో మూడు భారీ చిత్రాలు రూపుదిద్దుకోనున్నట్టు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ దర్శకులతో ఆ ప్రాజెక్ట్స్ ను ఓకే చేశారని రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజు రాబోయే చిత్రాలను భారీ స్కేల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్నాయని తెలుస్తోంది.ఇక ఆ చిత్రాలకు సంబంధించిన టైటిల్స్ కూడా రావడం ఆసక్తికరంగా మారింది.
దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటితో ‘జటాయు’ అనే చిత్రం తొలుత పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ‘హిట్ వెర్స్’తో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించిన దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇక పోతే కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో భారీ ప్రాజెక్ట్స్ ను రూపొందించబోతున్నారంట. దీనికి ‘రావణం’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నారంట. ఈ ఏడాది అక్టోబర్ 23 లేదంటే డిసెంబర్ లో ‘రావణం’పై అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఇక మిగితా ప్రాజెక్ట్స్ పై త్వరలో అఫిషియల్ అప్డేట్ రానుందని అంటున్నారు.
ఇక, ప్రస్తుతం దిల్ రాజు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - తమిళ దర్శకుడు ఎస్ శంకర్ కాంబినేషన్ లో ‘ఆర్సీ15’ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజ్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు.. తాజాగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను కూడా రివీల్ చేయడంతో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ చిత్రాన్ని రిలీజ్ చేశారు దిల్ రాజు. తమిళం దుమ్ములేపుతున్న ఈ చిత్రం.. తెలుగులో బాక్సాఫీస్ వద్ద కాస్తా స్లో ఉన్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో లాంగ్ రన్ తో థియేటర్లలో సందడి చేస్తుందని అంటున్నారు.