సుధీర్ బాబు షాకింగ్ కామెంట్స్...ఏ హీరోని ఉద్దేశించి?

Published : Jan 17, 2023, 09:36 AM IST
 సుధీర్ బాబు షాకింగ్ కామెంట్స్...ఏ హీరోని ఉద్దేశించి?

సారాంశం

 ఓ ఇంటర్వూలో సుధీర్ బాబు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి ఏ సినిమా ని ఉద్దేశించి, ఏ హీరోలను ఉద్దేశించి అనేది ఎవరికి వారు ఊహిస్తున్నారు.    

"రీసెంట్ గా నేను కొన్ని సినిమాలు చూసాను, ప్రతీ రెండు నిముషాలకు ఒక డైలాగు పెట్టామా, నెక్ట్స్ కామెడీ సీన్ పెట్టామా, నెక్స్ సాంగ్ వేశామా,  వాటికి ఏమి పేరు పెట్టాలో తెలియదు కానీ, అవి ఆడాయి. కానీ ఓ ఫిల్మ్ మేకర్ గా నేను సాటిస్పై కాదు, అవి ఆడటం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్"  అంటూ ఓ ఇంటర్వూలో సుధీర్ బాబు అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి ఏ సినిమా ని ఉద్దేశించి, ఏ హీరోలను ఉద్దేశించి అనేది ఎవరికి వారు ఊహిస్తున్నారు.  

ఇక సుధీర్ బాబు తాజా చిత్రం విషయానికి వస్తే...భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో 'హంట్' సినిమా రూపొందింది. సుధీర్ బాబు హీరోగా మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శ్రీకాంత్ .. భరత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను డ్యూయెల్ రోల్ చేశానని అనుకుంటారు .. కానీ అలాంటిదేం లేదు. పాత్ర పరంగా రెండు రకాలుగా కనిపిస్తాను అంతే. ఈ కథలో నేను పోలీస్ ఆఫీసర్. ప్రమాదం జరగడానికి ముందు .. ఆ తరువాత అన్నట్టుగా ఆ పాత్ర ముందుకు వెళుతుంది" అన్నాడు. 

" నా సినిమాల్లో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది .. కానీ నాకు ఎమోషనల్ కంటెంట్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ఆరోగ్యంగా ఉండటం కోసం జిమ్ చేస్తాను .. అంతేగానీ సిక్స్ ప్యాక్ చూపించడం కోసం కాదు. నిజానికి షర్ట్ తీయాలంటే నేను చాలా ఇబ్బంది పడిపోతాను" అంటూ చెప్పుకొచ్చాడు.
 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌