బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. సరైన హీరోయిన్ సెట్ కాకపోవటంతో పూర్ణలాంటి స్టార్ డమ్ లేని హీరోయిన్ తో ముందుకు వెళ్తున్నాడు. అయితే బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేకమైన స్దానం ఉంది. తనకున్న పరిచయాలతో స్టార్ హీరోయిన్స్ అడుగుతున్నారట బోయపాటి. అయితే ఎవ్వరూ ఇప్పటిదాకా సెట్ కాలేదంటున్నారు.
బాలయ్యతో చక్కటి యాక్షన్ సినిమా చేయచ్చు అని డైరక్టర్స్ ప్లాన్ చేసుకుంటారు. ఆ యాక్షన్ కు సరపడ గ్లామర్ గాళ్ ని తెచ్చి హీరోయిన్ ని చేద్దామనుకుంటారు. అయితే సమస్య అక్కడే వచ్చస్తోంది. బాలయ్య సినిమా అంటే బాబోయ్ అంటూ దూరం పెట్టేస్తున్నారు హీరోయిన్స్. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆయన సీనియర్ హీరో అయ్యిపోవటం ప్రధాన కారణం.
బాలయ్య,చిరంజీవి వంటి హీరోలతో చేస్తే తర్వాత యంగ్ హీరోలు దూరం పెట్టేస్తారని ఓ భయం. అంతేకాదు బాలయ్య సినిమా అంటే కాస్త బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది. రెమ్యునేషన్స్ ఎక్కువ డిమాండ్ చేసుకోవటానికి ఉండదు. అలాగే టైమ్ అంటే టైమే. చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఇవన్ని ఇండస్ట్రీలో చెప్పుకునే మాటలు. ఇవన్ని వినే హీరోయిన్స్ ముందే మనకెందుకులే అని సైడ్ అయ్యిపోతున్నారు. దాంతో ప్రతీ సారి హీరోయిన్స్ సమస్య వచ్చేస్తోంది బాలయ్యకు.
ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. సరైన హీరోయిన్ సెట్ కాకపోవటంతో పూర్ణలాంటి స్టార్ డమ్ లేని హీరోయిన్ తో ముందుకు వెళ్తున్నాడు. అయితే బోయపాటి సినిమాలో ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేకమైన స్దానం ఉంది. తనకున్న పరిచయాలతో స్టార్ హీరోయిన్స్ అడుగుతున్నారట బోయపాటి. అయితే ఎవ్వరూ ఇప్పటిదాకా సెట్ కాలేదంటున్నారు.
హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తే వచ్చే కిక్ వేరు అని నిర్మాతతో భారీగా రెమ్యునేషన్ ఇప్పించి చేద్దామనుకున్నా హీరోయిన్స్ ..తమ కాల్షీట్స్ ఖాళీగా లేవని గౌరవంగా తప్పుకోవటంతో ఏం చేయాలో అర్దం కాక బోయపాటి తలపట్టుకుంటున్నాడట. మే లో రిలీజ్ అనుకుంటున్నారు. ఇంటే మినిమం ఏప్రియల్ కు షూటింగ్ పూర్తవ్వాలి. ఇప్పటికే కరోనాతో బాగా లేటైపోయింది. దాంతో ఇంక హీరోయిన్స్ ఐటం సాంగ్స్ కు దొరక్కపోతే హాట్ గా ఉండే ఓ కొత్తమ్మాయితో లాగేద్దమని ఫిక్స్ అయ్యాడట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
హైదరాబాద్‌లో పునః ప్రారంభమైన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు యాంగిల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. కొన్ని సీన్స్ లో అఘోరాగా ఆయన కనపడ నున్నట్టు సమాచారం. సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ ఇది. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ అభిమానులను చాలా ఆకట్టుకుంది.
ఇక ఈ చిత్రం కోసం మరో నందమూరి హీరోని ఎంపిక చేసారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నందమూరి తారకరత్న అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన యంగ్ ఎమ్మల్యే గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని ,తారకరత్నకు మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే పాత్ర అవుతుందని చెప్తున్నారు.
ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనివినపడుతోంది. మరో ప్రక్క ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, హీరోయిన్ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుని షూటింగ్ మొదలు అయిన వెంటనే పోస్టర్ లేదా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్ . ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి చెప్పిన విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.