‘పొన్నియిన్ సెల్వన్’ కోసం స్టార్ హీరోలు.. అదిరిపోయే ప్లాన్ వేసిన మణిరత్నం.!

By team teluguFirst Published Sep 27, 2022, 6:01 PM IST
Highlights

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
 

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’(Ponniyin Selvan 1). ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్లుగా ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, క్రిష్ణన్, శోభితా ధూళిపాళ కనువిందు చేయనున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్, టీజర్ ను చూస్తే ప్రేక్షకులకు అసలైన విజువల్ వండర్ ను చూపించేలా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది.

గత కొద్దికాలంగా అన్ని ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని భాషల ప్రేక్షకులకు తమ సినిమా రీచ్ అయ్యేలా మేకర్స్ భిన్నంగా ప్రమోషన్స్ ను, చిత్ర నిర్మాణంలోనూ స్టార్ హీరోల సహకారం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగులో చిరంజీవి, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, కన్నడలో ఉపేంద్ర అలాగే హిందీలో అజయ్ దేవగన్  వాయిస్ అందించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా భాషల్లో సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గరచేయడంతో పాటు సర్ ప్రైజింగ్ గా ఉండేలా మణిరత్నం ప్లాన్ చేశారంట. 

ఇప్పటికే తెలుగులో రూపొందిన ‘రాధే శ్యామ్’తో పాటు తదితర చిత్రాలకు ఇతర భాషల్లోని స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘పొన్నియిన్ సెల్వన్ 1’లోనూ ఆ సర్ ప్రైజ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ప్రముఖ ప్రొడక్షన కంపెనీలు మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై  చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ సంగత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

click me!