టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట మొదలైన పెళ్లి సందడి

Published : Dec 02, 2022, 12:30 PM IST
టాలీవుడ్ స్టార్  డైరెక్టర్ గుణశేఖర్ ఇంట మొదలైన పెళ్లి సందడి

సారాంశం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. తన మార్క్ సినిమాలతో జయాపజయాలు పట్టించుకోకుండా.. ఇండస్ట్రీలో ఓ  స్పెషల్ ఇమేజ్ సాధించిన గుణశేఖర్.. తన కూతురు పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్నారు.   

తెలుగు దర్శకుడు గుణశేఖర్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. గుణశేఖర్ కూతురు నీలిమా పెళ్ళికూతురయ్యింది. గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. నీలిమ పెళ్ళి కుదిరి చాలా రోజులు అవుతుండగా.. ఆమె నిశ్చితార్ధం వేడుక హైదరాబాద్ లో ఘనంగాజరిగింది. సిటీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ వేడుగ గ్రాండ్ గా నిర్వహిచారు గుణశేఖర్. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు హాజయ్యి... జంటనుఆశ్వీర్వదించారు. 

గుణశేఖర్ కుమార్తె నీలిమ నిశ్చితార్థం వేడుక  రవి ప్రఖ్యాతో  జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. ప్రస్తుతం నిశ్చితార్ధానికి సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నిచ్చితార్ధం వేడుకలో సినీ ప్రముఖులతో పాటు.. కొండా సురేఖ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అటు నీలిమ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి రవి ప్రఖ్యాత్  ఓ బిజినెస్ మెన్ అని సమాచారం. కోట్ల విలువ చేసే వ్యాపారాలు నిర్వహిస్తున్నారట రవి, 

ఇక ప్రస్తుతం గుణశేఖర్ సమంత లీడ్ రోల్ లో శాకుంతలం సినిమాను తెరకెక్కించారు. మహా భారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెకింది. ఈ శాకుంతలం సినిమాను..  పాన్‌ ఇండియా లెవల్‌ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  గ్రాఫిక్స్ మాయాజాలంతో పాటు.. చరిత్రను ఇప్పటి వారికి తెలిపే విధంగా ఈసినిమాను  తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక రిలీజ్ పై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌