Yogi Babu:అజిత్ పై మండిపడుతున్న యోగిబాబు,పెద్ద తప్పే జరిగింది

Surya Prakash   | Asianet News
Published : Feb 27, 2022, 10:38 AM IST
Yogi Babu:అజిత్ పై మండిపడుతున్న యోగిబాబు,పెద్ద తప్పే జరిగింది

సారాంశం

  చెన్నై నుంచి వస్తున్న సమాచారం మేరకు యోగిబాబు ఈ విషయంలో చాలా అప్ సెట్ అయ్యారట. డైరక్టర్ మీద, తల అజిత్ మీద పట్టలేనంత కోపంగా ఉన్నారట. కాకపోతే అజిత్ పెద్ద స్టార్ కావటంతో నోరు మెదపలేదట.


తమిళనాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో అజిత్‌ ఒకరు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ ఓ పండగలా భావిస్తూ వస్తున్నారు. దాంతో  అజిత్‌ కొత్త సినిమా రిలీజ్ వస్తోందంటే  అభిమానులతో పాటు ట్రేడ్‌ వర్గాల్లో కూడా విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అజిత్‌ ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు. హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ హంగులతో తెరకెక్కించిన సినిమా అంటూ పబ్లిసిటీ జరగడంతో ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అంచనాలకు తగ్గట్లే అదిరిపోయే ఓపినింగ్స్ తో తమిళంలో, జస్ట్ యావరేజ్ టాక్ తో  తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ‘వలిమై’విషయంలో కమిడియన్ యోగిబాబు చాలా ఫీలవుతున్నారని సమాచారం.

అందుకు కారణం యోగిబాబు ఈ సినిమాలో కామెడీ రోల్ చేసారు. అయితే గమ్మత్తుగా ఒక్కసీన్ కూడా సినిమాలో లేదు. మొత్తం సీన్స్ అన్నీ ఎడిటింగ్ లో లేపేసారు. లెంగ్త్ పెరిగిందని తీసాసామని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.  చెన్నై నుంచి వస్తున్న సమాచారం మేరకు యోగిబాబు ఈ విషయంలో చాలా అప్ సెట్ అయ్యారట. డైరక్టర్ మీద, తల అజిత్ మీద పట్టలేనంత కోపంగా ఉన్నారట. కాకపోతే అజిత్ పెద్ద స్టార్ కావటంతో నోరు మెదపలేదట.

ఇక ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు ఇప్పుడిప్పుడే హీరోగానూ తన సత్తా చాటుతున్నాడు. ఈ యేడాది ఏప్రిల్ లో అతను ప్రధాన పాత్ర పోషించిన ‘మండేలా’ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు వీక్షకుల అభినందనలూ అందుకున్న ‘మండేలా’కు మరో గౌరవం దక్కింది. ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ ఛైర్మన్ గా ఉన్న ఆస్కార్ ఇండియన్ మూవీస్ సెలక్షన్ కమిటీ ఇటీవల దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 14 సినిమాలను ఎంపిక చేసింది. అందులో యోగిబాబు నటించిన తమిళచిత్రం ‘మండేలా’ సైతం ఉండటం విశేషం.  ఈ స్టార్ కమెడియన్ ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు హరి ‘యానై’, ‘తమిళరాసన్’ చిత్రాలతో పాటు షారుక్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న అట్లీ హిందీ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?