
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. అందులో చాలా మంది మంచి వాళ్లు ఉంటారు.. మోసం చేసేవాళ్ళు ఉంటారు..మోసపోయిన వాళ్ళు ఉంటారు. తను కూడా ఓ సారి ఘోరంగా మోసపోయాను అంటున్నాడు కమెడియన్ శివారెడ్డి.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్లు సంపాధించిన వారు ఉన్నారు...ఎవరినో నమ్మి అంతకంటే ఎక్కువ పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఆర్ధికంగా మంచి పోజీషన్ లో ఉండాల్సిన వారు.. కష్టాల కొలిమిలో కాలుతూ.. ఇబ్బందులు పడుతున్న వారు బోలెడ్ మంది ఇండస్ట్రీలో. ఇక అలాంటి కథే కమెడియన్ శివారెడ్డిది.
దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు కమెడియన్ శివారెడ్డి. మిమిక్రీ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా మంచి పేరు సంపాధించుకున్న శివారెడ్డి ఓ ఫ్రెండ్ చేతిలో మోసపోయాడు ఓ ఇంటర్వ్యూలో తాను ఎలా మోసపోయాడో క్లియర్ గా చెప్పాడు. తనను ఎలా నమ్మించి నట్టేట ముంచారో వివరించాడు. చాలా చిన్నవయస్సులోనే శివారెడ్డి ఇండస్ట్రీకి వచ్చాడు. ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా బిజీ అయిన శివారెడ్డి... అప్పటికే చాలా డబ్బులు సంపాధించాడు.
అప్పుడప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న శివారెడ్డి దేశ విదేశాల్లో ఎన్నోకామెడీ షోలు చేసుకుంటూ దాదాపు 70 లక్షల వరకూ కూడబెట్టాడు. అప్పటికీ పెళ్లి కాకపోవడంతో.. ఓ ఇల్లు కాని.. స్థలం కాని తీసుకోవాలి అని గట్టిగాప్రయత్నించాడట. అయితే అదే సమయంలో ఇల్లు.. స్థలాలు చూసుకుంటు వెళ్తుండగా.. ఇది బాలేదు.. అది బాలేదు అంటూ తన ఫ్రెండ్ తనను ప్రాపర్టీ తీసుకోకుండా ఆపాడట.
అప్పుడు నెల రోజుల ప్రోగ్రాం కోసం అమెరికా వెళ్లిన శివారెడ్డి ఆ 70 లక్షలు ఫ్రెండ్ ఇంట్లోపెట్టాడట. తనను తన ఫ్యామిలీన నమ్మి అంత డబ్బు ఆ ఇంట్లో పెట్టి అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే ఇల్లు తీసుకోవడం కోసం వెతికాడట. అప్పుడు డబ్బుల గురించి అడిగితే అత్యవసరంగా ఆ డబ్బులు తాము వాడుకున్నట్టు తన ఫ్రెండ్..వాళ్ల ఫ్యామిలీ చెప్పడంతో తాను ఎంత మోసపోయాడో అప్పుడు అర్ధం అయ్యింది అన్నాడు శివారెడ్డి.
ఆ డబ్బు ఇంత వరకూ తన ఇవ్వలేదని బాధపడ్డాడు. తను కష్టపడి సంపాదించ సోమ్మును నమ్మించి కాజేశారంటూ బాధపడ్డాడు. ఆ డబ్బు అప్పుడు ఉండి ఉంటే.. మణి కొండలో తనకు ఇప్పుటికి రెండు మూడు ఎకరాల ప్లేస్ ఉండేదంటున్నాడు శివారెడ్డి. తనలా ఎవరూ నమ్మి మోసపోవద్దంటున్నాడు స్టార్ కమెడియన్. ఆతరువాత కూడా సినిమాలు, స్పెషల్ ప్రోగ్రాంమ్స్ చేసినా.. ఇంత పెద్ద మొత్తంలో ఆర్ధికంగా దెబ్బతినడంతో లైఫ్ లో కోలుకోలేకపోయినట్టు చెప్పారు శివారెడ్డి.