అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం!

Published : Apr 23, 2023, 03:12 PM ISTUpdated : Apr 23, 2023, 03:29 PM IST
అత్యంత విషమంగా శరత్ బాబు ఆరోగ్యం!

సారాంశం

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరత్ కుమార్ ఆరోగ్యం విషమించినట్లు సమాచారం అందుతుంది. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న శరత్ బాబు కోలుకోలేదంటున్నారు.

సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్ వ్యాపించిందని, ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.

కొన్నాళ్ల కిందట అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. చెన్నైలో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే మరోసారి అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టంతో ఈ నెల 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందిశరత్ బాబు శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. శరత్ బాబు ఆరోగ్యంపై ఈ రోజు సాయంత్రం బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

శరత్ కుమార్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో ఆయన సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆయన నటించిన మొదటి చిత్రం రామ రాజ్యం. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. ఐదు దశాబ్దాల కెరీర్లో శరత్ బాబు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఆయన చివరిగా కనిపించిన తెలుగు చిత్రం వకీల్ సాబ్.

శరత్ బాబు 1974లో లేడీ కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. 1988లో విబేధాలతో ఆమెతో విడిపోయారు. అనంతరం 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా బంధం సవ్యంగా సాగలేదు. 2011లో విడాకులు తీసకొని విడిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్