
సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి కుష్బు. మెగాస్టార్ చిరంజీవి తప్పించి.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన మెరిసింది బ్యూటీ. కుష్బుకు ఏకంగా గుడి కట్టారంటే.. ఆమె ఇమేజ్ ఏరేంజ్ లో ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటు సౌత్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించింది కుష్బు. సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది కుష్బూ. అంతే కాదు బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ షో.. జబర్థ్స కు జడ్జిగా ఉన్న కుష్బుూ.. తెలుగులో మరికొన్ని ప్రోగ్రామ్స్ కు అటెండ్ అవుతూ వస్తోంది. ఈమధ్య ఆమె ఎక్కువగా అనారోగ్యానికి గురవుతోంది. గతంలో కూడా చాలాసార్లు హస్పిటలైజ్ అయిన కుష్పు... తాజాగా మరోసారి హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని స్వయంగా పోస్ట్ చేసిన కుష్బు. తనకు ఏమైంది అని కంగారు పుడుతున్న ఫ్యాన్స్ కు సపోర్టర్స్, అసలువిషయాన్ని వెల్లడించింది. తన పోస్ట్ ద్వారానే తనకు ఏం జరిగింది అనేది క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.
కుష్బు పోస్ట్ చేస్తూ.. తనకు కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) ట్రీట్మెంట్ కోసం కోసం మళ్ళీ తాను హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు తన పరిస్థితి బాగానే ఉందని..మెల్లగా కోలుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమె పరిస్థితిపై సోషల్ మీడియాలో ఆరాతీస్తు్న్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్టు. కోలుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చింది కుష్బు.
అంతే కాదు తన అభిమానులెవరూ కంగారుపడొదంటూ అనౌన్స్ చేసింది కుష్బు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఈమె ఎడినో వైరస్ భారిన పడి హాస్పిటల్ పాలైంది కుష్బు సుందర్ . ఈ వైరస్ సోకినవారికి జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. కుష్బూకి కూడా వాటితోనే ఇబ్బందిపడుతున్నట్టు అప్పుడు చెప్పుకొచ్చింది. అయితే ఆమె త్వరగానే కోలుకుంది. తర్వాత ‘రామబాణం’ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంది.