టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani)కి పద్మశ్రీ దక్కింది. ఇందుకు ఎస్ఎస్ రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు రావడం పట్ల ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న అత్యున్నత పౌరపురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన 12 మందికి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు (Padma Shri)ని ప్రకటించారు. వీరిలో టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) కూడా ఒకరవడం విశేషం. దీంతో కీరవాణి అభిమానులు, తెలుగు ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు రిపబ్లిక్ డే వేడుకల్లోనూ గవర్నర్ తమిళసై కీరవాణిని సన్మానించి, అభినందించారు.
అయితే, కీరవాణికి ‘పద్మశ్రీ’ దక్కడం పట్ల ట్వీటర్ వేదికన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) ఆసక్తికరంగా స్పందించారు. ‘మా పెద్దన్న ఎంఎం కీరవాణికి పద్మశ్రీ అవార్డు దక్కడం గర్వంగా ఉంది. పెద్దన్న మీ ఫ్యాన్స్ భావించినట్టుగానే ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సింది. చాలా ఆలస్యమైంది. కానీ మీరు ఎప్పుడూ అంటుంటారు కాదా.. మన కష్టానికి ప్రతిఫలం ఊహించని దారిలో అందుతుందని. ఇక నేనే గనుక విశ్వంతో మాట్లాడగలితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరోకటి ఇవ్వమని చెబుతాను’ అంటూ ఆసక్తికరంగా స్పందించారు. ఈ సందర్భంగా కీరవాణితో కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం జక్కన్న ట్వీట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి వేల సంఖ్యలో పాటలు కంపోజ్ చేశారు. బ్లాక్ బాస్టర్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ‘ఆర్ఆర్ఆర్’తో కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ‘నాటు నాటు’ పాటతో గ్లోబల్ గా గుర్తింపు పొందారు. ఇప్పటికే ఈ సెన్సేషనల్ సాంగ్ తో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్నారు. మరోవైపు ఆస్కార్ అవార్డ్స్ 2023 బరిలోనూ నిలిచింది. అకాడెమీ మొన్న విడుదల చేసిన జాబితాలో Naatu Naatu సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నామినేట్ అయ్యింది. దీంతో Oscar Awardకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. మార్చి 12న ఫైనల్ రిజల్ట్ అందనుంది. తప్పకుండా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ దక్కించుకుంటుందని అంతా ఆశిస్తున్నారు.
MY PEDDANNA.
MM KEERAVAANI.
RECIPIENT OF PADMA SHRI AWARD.
PROUD!!!
Like many of your fans feel, this recognition indeed was long over due.
But, as you say the universe has a strange way of rewarding one's efforts.
If I can talk back to universe, I would say
Konchem gap ivvamma. okati poorthigaa enjoy chesaaka inkoti ivvu. 🥰 pic.twitter.com/JSNnivpRNq