డబ్బిస్తేనే వస్తా.. శ్రుతిహాసన్ తీరుతో షాక్!

Published : Jan 02, 2019, 04:22 PM IST
డబ్బిస్తేనే వస్తా.. శ్రుతిహాసన్ తీరుతో షాక్!

సారాంశం

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటించిన శ్రుతిహాసన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది. అవకాశాలు లేకనో, ఆమె ఆసక్తి చూపకనో సౌత్ లో సినిమాలు అయితే బాగా తగ్గించేసింది. 

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటించిన శ్రుతిహాసన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది. అవకాశాలు లేకనో, ఆమె ఆసక్తి చూపకనో సౌత్ లో సినిమాలు అయితే బాగా తగ్గించేసింది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సలేతో ప్రేమ వ్యవహారం సాగిస్తోన్న ఈ బ్యూటీ ఇటీవల ఓ హిందీ సినిమాకు సైన్ చేసింది.

'ఠాకూర్ దేవదాస్' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో విద్యుత్ కంటే శ్రుతి డబుల్ రెమ్యునరేషన్ చార్జ్ చేస్తోందని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాకు రోజువారీ పద్దతిలో పేమెంట్ తీసుకుంటుందట. అది కూడా అడ్వాన్ గా అని సమాచారం.

తన మేనేజర్ అడ్వాన్స్ ముట్టిందని చెబితేనే ఆరోజు షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ లెక్కన ఆమె ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ముట్టజెప్పుతున్నారని సమాచారం.

ఈ సినిమాలో నజీరుద్ధీన్ షా, అమోల్ పాలేకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తప్ప శ్రుతి మరే సినిమాకు సైన్ చేయలేదు. ఈ ఏడాదిలో శ్రుతి నుండి ఓ ఆల్బం కూడా రాబోతుందని అంటున్నారు. నటిగా కంటే సింగర్ గా సెటిల్ అవ్వాలని చూస్తోందని టాక్!

PREV
click me!

Recommended Stories

చిరు, పవన్, చరణ్, బన్ని.. మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకు, మామా అల్లుడితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరు?
Illu Illalu Pillalu Today Episode Feb 4: అమూల్యను కొట్టిన చందు, వల్లికి ఇక కాళరాత్రే