అరుదైన ఘనత సాధించిన తెరవెనుక హీరో.. RRR టీం శుభాకాంక్షలు!

Published : Jul 02, 2019, 04:56 PM IST
అరుదైన ఘనత సాధించిన తెరవెనుక హీరో.. RRR టీం శుభాకాంక్షలు!

సారాంశం

అద్భుతమైన చిత్రాలు చూసిన తర్వాత ఎక్కువగా నటీనటుల గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ చిత్రం వెనుక దర్శకుడితో పాటు సాంకేతిక నిపుణుల కష్టం కూడా ఉంటుంది.

అద్భుతమైన చిత్రాలు చూసిన తర్వాత ఎక్కువగా నటీనటుల గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ చిత్రం వెనుక దర్శకుడితో పాటు సాంకేతిక నిపుణుల కష్టం కూడా ఉంటుంది. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్లుగా గ్రాఫిక్స్, విజువల్స్ వచ్చినప్పుడే ఆ చిత్రం స్థాయి పెరుగుతుంది. అలా దర్శకుల కోరుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ అందించగలిగే కొద్ది మందిలో శ్రీనివాస్ మోహన్ ఒకరు. 

బాహుబలి, రోబో, క్రిష్, ఐ లాంటి చిత్రాల వెనుక శ్రీనివాస్ మోహన్ కష్టం కూడా దాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా ఆయన ఎన్నో చిత్రాలకు పనిచేసారు. తాజాగా శ్రీనివాస్ మోహన్ అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్ అవార్డ్స్ అందించే ది అకాడమీ సంస్థలో శ్రీనివాస్ మోహన్ అధికారికంగా ప్యానల్ సభ్యుడయ్యారు. 

తాజాగా ది అకాడమీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 842 కొత్త సభ్యులని ప్రకటించింది. ఇందులో ఇండియా నుంచి శ్రీనివాస్ మోహన్, అనుపమ్ ఖేర్ ఎంపికయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్యానల్ లో శ్రీనివాస్ మోహన్ సభ్యుడయ్యారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఈయనే విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు. 

ఈ వార్త గురించి తెలియగానే ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా వేదికగా శ్రీనివాస్ మోహన్ కు శుభాకాంక్షలు తెలియజేసింది. 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు