విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది
ట్రైలర్, టీజర్ లతోనే బజ్ క్రియేట్ చేయకపోతే ఆ సినిమాని ఎవరూ పట్టించుకోని పరిస్దితి. మినిమం ఓపినింగ్స్ కూడా రావటం లేదు. దాంతో దర్శక,నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్ కు జనాల్లోకి తీసుకువెళ్లటానికి అన్ని జాగ్రత్తలతో ట్రైలర్ ని రెడీ చేసి వదులుతున్నారు. తాజాగా ‘పెద్ద కాపు’-1 ట్రైలర్ వచ్చింది.
కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత రూట్ మార్చి వెంకటేష్ తో ‘నారప్ప’ వంటి ఊర మాస్ మూవీ తీసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ‘పెద్ద కాపు’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో తనలోని పూర్తి మాస్ ని బయట పెట్టారు. ఇక ఈ సినిమా రెండు పార్ట్ లుగా ఈ సినిమా రాబోతుంది. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి ఒక సామజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ గా పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో కొత్త కుర్రాడు ‘విరాట్ కర్ణ’ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ లో సినిమా కథాంశం ఏంటో చెప్పేశాడు. ఒక ఊరిలోని ఇద్దరు పెద్దమనుషులు మధ్య చిక్కుకొని ఎన్నో బాధలు పడుతున్న సామాన్య జనం.. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగుతూ వారి నుంచి ఓ హీరో పుట్టి, వారి పై తిరగబడి ఎలా పోరాటం చేశారు అనేదే సినిమా స్టోరీ లైన్ అని తెలుస్తుంది. పొలిటికల్ డ్రామాతో కూడుకున్న ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల పూర్తి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడు.ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది.
ఈ చిత్రాన్ని అఖండ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, బ్రిగడ సగ, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలై సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఫైట్స్ కంపోస్ట్ చేశారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ చేశారు. రాజు సందరం కొరియోగ్రఫీ చేశారు.