కొత్త సినిమా షూటింగ్‌ పూర్తి.. జాన్వీ కపూర్‌ హృదయాన్ని టచ్‌ చేసే పోస్ట్..

Google News Follow Us

సారాంశం

అతిలోక సుందరి తనయ శ్రీదేవి.. `దేవర` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. అయితే హిందీలో ఆమె నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్‌ నోట్ ని పంచుకుంది.

జాన్వీ కపూర్‌.. తనని తాను స్టార్‌గా, నటిగా మలుచుకుంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఆ ఇమేజ్‌ని కాపాడుకుంటూ దూసుకుపోతుంది. తల్లిలాగే పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇటీవల `బవాల్‌` చిత్రంతో మెరిసిన జాన్వీ.. ఇప్పుడు మరో సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. 

ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న చిత్రాల్లో `ఉల్జా` చిత్రం ఒకటి. ఇందులో గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మాథ్యూ మెయిన్‌ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి నేషనల్‌ అవార్డు వి్నర్‌ సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని జాన్వీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఒక హృదయాన్ని టచ్‌ చేసే పోస్ట్ పెట్టింది. 

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందని, కానీ ఈ సినిమా ద్వారా క్రియేట్‌ చేసే ప్రపంచంలోనే, ఇంకా ఆ డ్రీమ్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుందని తెలిపింది. ప్రతి సినిమా ఒక లెసన్‌ అని, ఈ సినిమా కథ, ఇందులో చోటు చేసుకున్న సంఘటనలు యాదృశ్చికంగా తన జీవితంలోనూ చోటు చేసుకున్నాయని, అందుకే తన లైఫ్‌కిది దగ్గరగా ఉందని తెలిపింది. ఆ విధంగా ఈ సినిమా స్టోరీకి బలంగా కనెక్ట్ అయినట్టు చెప్పింది. సినిమాలో సుహానా జర్నీ ద్వారా తాను తెలుసుకున్న అతిపెద్ద లెసన్‌ ఏంటంటే.. మీరు చేసే పనిని ప్రేమించడం, సరైన కారణాలతో మీరు చేస్తున్నారో లేదో గుర్తించడం, బాహ్య ఒత్తిళ్లు, అభిప్రాయాలను వదిలేని మనకు నచ్చింది చేయడమనేది ఈ సినిమా ద్వారా నేర్చుకున్నట్టు చెప్పింది జాన్వీ. 

ఈ సందర్భంగా దర్శకులు సుధాన్షుని ఉద్దేశించి జాన్వీ మాట్లాడుతూ, తనకు తెలియకుండా తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. తనలో ఇంతటి పోరాట శక్తి ఉందని గ్రహించినందుకు, అదే సమయంలో ఎంతటి సవాలునైనా, అవరోధాలనైనా నవ్వుతో స్వీకరించాలని  ఆ విషయంలో తనకు స్ఫూర్తిదాయకంగా నిలిచావని పేర్కొంది. ఈ సందర్బంగా ఈ సినిమాలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి జాన్వీ ధన్యవాదాలు తెలిపింది. 

మరోవైపు హిందీలో `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి` చిత్రంలోనూ నటించింది జాన్వీ. ఇది విడుదల కావాల్సి ఉంది. ఇంకోవైపు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ జాన్వీ కపూర్‌.. `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా రిలీజ్‌ కాబోతుంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on