సోమవారం అంత్యక్రియలు, ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఏముంది?

First Published Feb 25, 2018, 6:11 PM IST
Highlights
  • గుండెపోటుతో చనిపోయిన నటి శ్రీదేవి అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
  • సోమవారం ముంబైలో మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బోనీకపూర్ ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి.

గుండెపోటుతో చనిపోయిన నటి శ్రీదేవి అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.  ఆమె భౌతికకాయాన్ని తీసుకొచ్చేందుకు ముంబై నుంచి ప్రత్యేక విమానం దుబాయికి వెళ్లింది. సాయంత్రం నాలుగు గంటలకు ఆ విమానం భౌతికకాయంతో ముంబైకి తిరిగి రానుంది. ఇక సోమవారం ముంబైలో మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బోనీకపూర్ ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. దానికంటే ముందు శ్రీదేవి ఇంటి నుంచి మొహబూబా స్టూడియోకి ఆమె పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు.టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖుల నివాళుల తర్వాత శాంతాక్రూజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మేనల్లుడు మోహిత్‌ మార్వా మ్యారేజ్ నిమిత్తం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దుబాయ్‌లో ఆమె మరణించడంతో అక్కడి చట్టాల ప్రకారం ముందు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ఆమె మరణానికి గల కారణాలు ఏమిటి? ఉన్నట్టుండి గుండెపోటుకు రావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మరణానికి ముందు ఆమె ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఇలా అభిమానుల్లో నెలకొన్న అనుమానాలన్నీ ఫోరెన్సిక్ రిపోర్టుతో పటాపంచలుకానున్నాయి.

click me!