మరి కాసేపట్లో ముంబైకి శ్రీదేవి పార్థివదేహం, రేపు 2గం.కు అంతిమయాత్ర

Published : Feb 27, 2018, 08:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
మరి కాసేపట్లో ముంబైకి శ్రీదేవి పార్థివదేహం, రేపు 2గం.కు అంతిమయాత్ర

సారాంశం

శ్రీదేవి పార్థివ దేహాన్ని ముంబైకి తీసుకొస్తున్న కుటుంబసభ్యులు రేపు అభిమానుల సందర్శనార్థం ఉ.8.30నుంచి సెలెబ్రేషన్స్ క్లబ్ లో శ్రీదేవి భౌతిక కాయం అనంతరం 2. గంటలకు అంతిమ యాత్ర  

అందాలతార శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించటంతో ఎంబామింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్ కు తరలిస్తున్నారు. ఇక శ్రీదేవి  మృతిపై అభిమానుల్లో అనేక సందేహాలున్నా... ప్రస్థుతానికి జరగాల్సిన కార్యక్రమంపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువరించారు.

 

ఇక శ్రీదేవి భౌతిక కాయం ఈ రాత్రి పది గంటల వరకు ముంబై చేరుకోనుంది. రాగానే ప్రత్యేక అంబులెన్స్ లో.. లోఖండ్ వాలాలోని శ్రీదేవి నివాసమైన గ్రీన్ ఏకర్స్ కు తరసిల్సారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉ.8.30 నుంచి ముంబై సెలెబ్రేషన్స్ క్లబ్ లో వుంచుతారు. అనంతరం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు సంతాప సభ నిర్వహిస్తారు. అనంతరం మ. 2 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని, 3.30కు పవన్ హన్స్ స్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన వెలువరించారు.

 

PREV
click me!

Recommended Stories

Shambhala Movie Review: శంబాల మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఆది సాయికుమార్‌ కి సాలిడ్‌ బ్రేక్‌
Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!