Sri Vishnu New Movie: అల్లూరిగా పోలీస్ పాత్రలో మరో యంగ్ హీరో

Published : Apr 05, 2022, 02:10 PM ISTUpdated : Apr 05, 2022, 02:17 PM IST
Sri Vishnu New Movie: అల్లూరిగా పోలీస్ పాత్రలో మరో యంగ్ హీరో

సారాంశం

విభిన్న క్యారెక్టర్లకు పెట్టింది పేరు శ్రీవిష్ణు. ఫస్ట్ నుంచీ ఈ యంగ్ హీరో సక్సెస్ ఫెయిల్యూర్స్ తోసంబంధం లేకుండా సినిమాలుచేస్తున్నాడు. ఇక ఈసారి కూడా మంచి కాన్సెప్ట్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు శ్రీవిష్ణు.  

విభిన్న క్యారెక్టర్లకు పెట్టింది పేరు శ్రీవిష్ణు. ఫస్ట్ నుంచీ ఈ యంగ్ హీరో సక్సెస్ ఫెయిల్యూర్స్ తోసంబంధం లేకుండా సినిమాలుచేస్తున్నాడు. ఇక ఈసారి కూడా మంచి కాన్సెప్ట్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు శ్రీవిష్ణు.  
 
ఫస్ట్  నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో.. కొత్త కొత్త పాత్రలతో సినిమలు చేసుకుంటూ వస్తున్నాడు. తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి  అల్లూరి అనే టైటిల్ ను ఖరారు చేసి, ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. 

బెక్కెం వేణుగోపాల్  తో సంయుక్తంగా బబిత నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.  ఇది ఒక సిన్సియర్ ఆఫీసర్ చుట్టూ నడిచే కథ ఇది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ స్టార్  గా శ్రీవిష్ణు కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ తాను చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

బ్రోచేవారెవరురా తరువాత శ్రీ విష్ణు కెరీర్ లో పెద్దగా సూపర్ హిట్ లేదు. ఈ సినిమా తరువాత యంగ్ స్టార్  దూకుడు చూపిస్తాడని అనుకుంటే..తిప్పరా మీసం .. గాలి సంపత్ లాంటి సినిమాలతో వరుసగా ఫెయిల్యూర్స్ ను అందుకున్నాడు హీరో. ఆ తరువాత రాజ రాజ చోర సినిమాతో పర్వాలేదనిపించేకున్నాడు శ్రీవిష్ణు. కాని రీసెంట్ గా రిలీజ్ అయిన అర్జున ఫల్గుణ మళ్లీ  దెబ్బకొట్టేసింది. 

ప్రస్తుతం భళా తందనాన సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒక వేళ ఈ సినిమా ప్రభావం చూపించకపోయినా.. అల్లూరి సినిమాతో అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Prabhas ఇప్పుడు చేస్తున్నాడు, కానీ రజనీకాంత్‌ 20 ఏళ్ల క్రితమే చేశాడు.. ఆ మ్యాజిక్ వర్కౌట్‌ అయితే సంచలనమే
Illu Illalu Pillalu Today Episode Dec 31: నర్మదకు అసలు విషయం చెప్పేసిన అమూల్య, ఇక రప్పా రప్పే