AR Rahman: కొడుకు కెరీర్ పై దృష్టి పెట్టిన ఏఆర్ రెహమాన్, ఏకంగా ఏం చేశాడంటే..?

Published : Apr 05, 2022, 01:22 PM ISTUpdated : Apr 05, 2022, 01:24 PM IST
AR Rahman: కొడుకు కెరీర్ పై దృష్టి పెట్టిన ఏఆర్ రెహమాన్, ఏకంగా ఏం చేశాడంటే..?

సారాంశం

తన తనయుడు కెరీర్ పై దృష్టి పెట్టాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇప్పటికే సింగర్ గా పరిచయం అయిన అమీన్..ఇంకా ముందు కు వెళ్ళడానికి తన వెంట తీసుకెళ్తున్నాడు రెహమాన్. రీసెంట్ గా వీరు ఓ ఇంటర్నేషనల్ ఫెష్టివల్ లో ప్రత్యక్ష్యమవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

తన తనయుడు కెరీర్ పై దృష్టి పెట్టాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇప్పటికే సింగర్ గా పరిచయం అయిన అమీన్..ఇంకా ముందు కు వెళ్ళడానికి తన వెంట తీసుకెళ్తున్నాడు రెహమాన్. రీసెంట్ గా వీరు ఓ ఇంటర్నేషనల్ పెష్టివల్ లో ప్రత్యక్ష్యమవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
 
ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్  హిస్టరీలో ఏఆర్ రెహమాన్ ఓ ప్రత్యేక శఖం. ఇప్పటి వరకూ ఇండియ హిస్టరీలో ఎవరూ సాధించలేని విధంగా ఆస్కార్ ను సాధించి మన ఖ్యాతిని పెంచాడు రెహమాన్. రాను రాను ఆయన ప్రభావం తగ్గిపోయింది. శంకర్ లాంటి కొంత మంది డైరెక్టర్లకు మాత్రమే మ్యూజిక్ చేస్తున్నాడు. 

ఇక ఇఫ్పుడు తన వారసులను ప్రమోట్ చేసే పని స్టార్ట్ చేశాడు ఏఆర్ రెహమాన్. అందులో భాగంగానే ఇప్పటికే సింగర్ గా అందరికి పరిచయమైన ఏఆర్ అమిన్ కు బూస్టప్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానె రెహమాన్ తన కొడుకుని గ్రామీ అవార్డ్స్ పంక్షన్ కు స్వయంగా వెంటబెట్టుకుని వెళ్ళాడు. 

ఏఆర్ రెహ‌మాన్ గ్రామీ అవార్డుల వేడుకల్లో ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచారు. ఆయ‌న  ఒక్కరే కాదు త‌న కుమారుడు ఏఆర్ అమీన్‌తో క‌లిసి ఈ వేడుక‌ల‌లో సందడి చేశాడు రెహమాన్. అందుకే ఈ వేడుకలలో రెహమాన్ ప్రత్యేకం అయ్యారు. లాస్ వెగాస్ వేదిక‌గా ఆదివారం రాత్రి జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ఎప్ప‌టి మాదిరే సినీ ప్ర‌ముఖులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. 

ఎప్పటిలాగానే ఈసారి కూడా రెహ‌మాన్ ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు.అయితే ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి వ‌ర్ధ‌మాన గాయ‌కుడిగా ఇప్పుడిప్పుడే  ఫిల్మ్ ఇండస్ట్రీలో నిల‌దొక్కుకుంటున్న త‌న కుమారుడు అమీన్‌ను తీసుకుని ఈవెంట్ లో సందడి చేశారు. 

 

కుమారుడిని గ్రామీ అవార్డుల వేడుక‌కు తీసుకెళ్లిన రెహ‌మాన్ వేదిక‌పైకి త‌న కుమారుడిని తీసుకుని వెళ్లి మ‌రీ సెల్ఫీ తీసుకున్నారు. అవార్డ్ ఫంక్షన్ లో వీరిద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ ఫొటోను ఏఆర్ రెహమాన్  త‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెహ‌మాన్ ఆ ఫొటోకు గ్రామీస్ అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక తొలిసారిగా ఈ వేడుక‌ల‌కు హాజ‌రైన అమీన్ కూడా త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫొటోకు  పేరెంటింగ్ అన్న ట్యాగ్‌ను ఇచ్చాడు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?