Raj Tarun: వరుస ఫ్లాఫ్ లు..అందుకే రాజ్ తరుణ్ ఈ నిర్ణయం?!

Surya Prakash   | Asianet News
Published : Apr 05, 2022, 01:33 PM ISTUpdated : Apr 05, 2022, 01:47 PM IST
Raj Tarun: వరుస ఫ్లాఫ్ లు..అందుకే రాజ్ తరుణ్ ఈ నిర్ణయం?!

సారాంశం

తను నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా ప్రేక్షకులకు తెలియకుండా ఉంది. ఈ విధంగా వరుసగా 8 ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు రావడం కూడా గగనం అనుకున్నా ఏదో ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

ఉయ్యాల జంపాల వంటి పెద్ద హిట్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యి ఎంతో  గుర్తింపు సంపాదించుకున్నారు  రాజ్ తరుణ్ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.ఈ విధంగా మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత సినిమా చూపిస్త మామ సినిమాల్లో వంటి కొన్ని సినిమాల్లో నటించి మరిన్ని హిట్స్ ని  తన ఖాతాలో వేసుకున్నారు.ఇలా మొదటి రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్మాతలందరూ హీరో రాజ్ తరుణ్ దగ్గరకు క్యూ కట్టారు.

అయితే ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.ఇక తను నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో కూడా ప్రేక్షకులకు తెలియకుండా ఉంది. ఈ విధంగా వరుసగా 8 ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు రావడం కూడా గగనం అనుకున్నా ఏదో ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా స్టాండప్ రాహుల్ తో పలకరించిన రాజ్ తరుణ్ ఆ సినిమా నిరాశపరచయంతో ఇప్పుడు వెబ్ సీరిస్ ల వైపు ప్రయాణం పెట్టుకున్నారు.
 
అలానే సినిమాల్లో అవకాశాలు తగ్గిన వారికి కూడా ఓటీటీలు  ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అనేక మంది టాలీవుడ్ నటీనటులు వెబ్ సిరీస్ లలో నటించారు. ఈ క్రమంలో తాజాగా రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ZEE5 రూపొందించే "అహ నా పెళ్ళంట'' అనే ఒరిజినల్ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ భాగం అవుతున్నారు.  
 
ఎన్నో ఏళ్లుగా పెళ్ళి కోసం ఎదురు చూసి ఓ యువకుడు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన తర్వాత.. తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో వారిద్దరిపై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథంతో కామెడీ రొమాన్స్ ఎంటర్టైనర్ గా "అహ నా పెళ్ళంట'' తెరకెక్కుతోంది.  

ఇందులో రాజ్ తరుణ్ - శివాని రాజశేఖర్ జంటగా నటిస్తుండగా.. ఆమని - హర్షవర్ధన్ - పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. నగేష్ బన్నెల సినిమాటోగ్రఫి అందిస్తుండగా.. జాదుహ్ శాండి సంగీతం సమకూరుస్తున్నారు. కథ - స్క్రీన్ ప్లే దావూద్ అందించగా.. కళ్యాణ్ రాఘవ మాటలు రాస్తున్నారు. ‘ఏబీసీడీ’ ఫేమ్ సంజీవ్ రెడ్డి ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ తమాడ - సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.   

''ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ ఇది. అందరినీ అలరించేలా ఉంటుంది. కామెడీ డ్రామా - రొమాన్స్ తో సాగే ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్.. 30 నిముషాల నిడివితో 8 ఎపిసోడ్స్ గా ప్రసారం అవుతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది'' అని మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ''పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి.. తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించలేదు.

అందుకు కారణమైన అమ్మాయి - అబ్బాయి పై ఆ పెళ్లి కొడుకు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ లో చూడాలి. జీ5 వంటి పెద్ద సంస్థలో పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు'' అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?