
ఏదో ఒక వెరైటి లేకపోతే ప్రేక్షకుల దృష్టి ని తిప్పుకోవటం సినిమావాళ్లకు కష్టమైపోతోంది. దాంతో ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ...ట్రైలర్ దాకా అంతా ఏదో ఒక విభన్నత చూపటానికే ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీ విష్ణుతో సినిమా చేస్తున్న బ్రోచేవారెవరురా టీం అటువంటి ప్రయత్నమే చేసింది.
ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. ఊళ్ళోవారందరి దిష్టి ఈ 2019లో ఎవ్వరికి తగలకూడదని ఆశిస్తూ శుభంభూయాత్ !! అంటూ ఓ వెరైటీ పోస్టర్ విడుదల చేసింది . మెంటల్ మదిలో వంటి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇందులో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 'చలనమే చిత్రము .. చిత్రమే చలనము' అనేది ట్యాగ్ లైన్. తాజాగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.
క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని టీం చెబుతుంది. అయితే టైటిల్ పోస్టర్‌ని బట్టి చూస్తుంటే సినిమా ఖచ్చితంగా వినూత్నంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.